న్యూఇయర్ ఫుల్ బిజి, మెట్రో రైల్వే ట్రాక్ మీద దిగిన మహిళ, మొబైల్ ఫోన్ తో ఏం చేసిందంటే ?
బెంగళూరులోని నమ్మ మెట్రో రైలులో ఇటీవల కాలంలో ఎక్కువగా ఏదో ఒక కారణంగా వార్తల్లో నిలుస్తోంది. ముఖ్యంగా యువతి, యువకులు అల్లరి చేయడం, రీళ్లు చేయడం, మెట్రో నిబంధనలు ఉల్లంఘించడం తదితర ఘటనలు కూడా బెంగళూరు మెట్రోలో చోటు చేసుకుంటున్నాయని వెలుగు చూసింది.

అలాగే కింద పడిన మొబైల్ ఫోన్ తీయడానికి ఓ మహిళ ఏకంగా బెంగళూరు మెట్రో రైలు ట్రాక్ పై దిగిన ఘటన చోటుచేసుకోవడం కలకలం రేపింది. ఈ ఘటన న్యూ ఇయర్ రోజు జరగడంతో ఎలాంటి సమస్యలు తలెత్తాయో తెలుసుకుని బెంగళూరు మెట్రో రైలు ప్రయాణికులు అసహనం వ్యక్తం చేశారు. బెంగళూరులోని ఇందిరా నగర్ మెట్రో స్టేషన్‌లో నూతన సంవత్సరం రోజున ఓ మహిళ కిందపడిపోయిన మొబైల్ ఫోన్ తీసుకోవడానికి మెట్రో ట్రాక్‌పై దిగిన షాకింగ్ సంఘటన చోటుచేసుకుంది.
జనవరి 1వ తేదీ సోమవారం సాయంత్రం 6:40 గంటల ప్రాంతంలో ఇందిరానగర్ మెట్రో స్టేషన్‌లో మెట్రో కోసం ఎదురు చూస్తున్న మహిళ చేతిలో ఉన్న మొబైల్ ఫోన్ అటూఇటు తిప్పుతున్న సమయంలో ఆ మొబైల్ ఫోన్ జారి మెట్రో ట్రాక్‌పై పడింది. వెంటనే మెట్రో రైల్వే ట్రాక్ మీదకు పడిపోయిన మొబైల్ ఫోన్ తీసుకోవాలని ఆమె ప్రయత్నించింది. తరువాత మెట్రో రైలు ట్రాక్ మీదకు ఆమె దిగేసింది.

దీంతో అప్రమత్తమైన మెట్రో సిబ్బంది వెంటనే విద్యుత్ సరఫరాను పూర్తిగా నిలిపివేశారు. ఇక్కడి మెట్రో సిబ్బంది అప్రమత్తంగా ఉండడంతో పెను ప్రమాదం తప్పింది. మహిళ బాధ్యతారహితంగా వ్యవహరించడంతో 15 నిమిషాల పాటు బెంగళూరు మెట్రో రైలు రాకపోకలు నిలిచిపోయాయి. పర్పుల్ లైన్‌లో తప్పిపోవడం వల్ల ఒక మహిళ పెద్ద షాక్ నుండి బయటపడిందని బీఎంఆర్ సీఎల్ అధికారులు తెలిపారు. పవర్ కట్ తర్వాత ప్రతిదీ రీసెట్ చేయడానికి 15 నిమిషాల సమయం పట్టింది. దీంతో ఈ మార్గంలో రాకపోకలు ఆలస్యం అయ్యాయని, మహిళ ప్రాణాలతో బయటపడిందని నమ్మ బెంగళూరు మెట్రో అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications