Madhyapradesh: కదులుతున్న రైల్లో మహిళపై లైంగిక దాడి.. మధ్యప్రదేశ్‍లో ఘటన..
సోమవారం రాత్రి మధ్యప్రదేశ్ లో దారుణం జరిగింది. కదులుతున్న రైలులో ఓ మహిళను కొందరు వ్యక్తులు లైంగికంగా వేధించారు. వేధించడమే కాకుండా ఆమెను.. ఆమె బంధువును రైలు నుంచి తోసేశారు. వారిని చూసిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారమిచ్చి ఆస్పత్రికి తరలించారు. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ స్టేషన్ సమీపంలో కొంతమంది వ్యక్తులు తనను లైంగికంగా వేధించి, కదులుతున్న రైలులోంచి తోసేశారని 32 ఏళ్ల మహిళ బోరున విలపించింది.
పోలీసులు నిందితులపై ఇండియన్ పీనల్ కోడ్ (IPC) సెక్షన్‌లు 354, 307 కింద FIR నమోదు చేశారు. బాధితురాలు తీవ్రంగా గాయపడినట్లు గ్వాలియర్ పోలీసు సూపరింటెండెంట్ రాజేష్ చందేల్ తెలిపారు. ఝార్ఘండ్ కు చెందిన ఓ మహిళ కార్మికురాలు తన బంధువుతో కలికి గుజరాత్ వెళ్లేందుకు సూరత్ ఎక్స్‌ప్రెస్ ఎక్కారు. ఈ రైలు మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ సమీపంలోకి రాగానే ఐదుగురు వ్యక్తిలు ఆమెను ఫొటోలు తీయడం ప్రారంభించారు. దీనిని బాధితురాలు వ్యతిరేకించింది. దీంతో ఐదుగురు వీరితో వాగ్వాదానికి దిగారు. ఆమె బంధువు చేయి చేసుకున్నారు.

భయపడిపోయిన వారు. రైల్లో వేరే బోగిలోకి వెళ్లి కూర్చున్నారు. అయినా ఆ ఐదుగురు వారిని వెంబడించారు. మహిళను ఎక్కడపడితే అక్కడ తాకారు. వీరు వారిపై ఆగ్రహం వ్యక్తం చేయగా.. ఆ ఐదుగురు ఈ ఇద్దరని కదులుతున్న రైళ్లో నుంచి బయటకు తోసేశారు. మంగళవారం ఉదయం గ్వాలియర్, గుణ మధ్య బడోరి రైల్వే లైన్‌లోని రైల్వే ట్రాక్ సమీపంలో అపస్మారక స్థితిలో ఉన్న బాధితులు కనిపించడంతో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. బాధితులను వెంటనే ఆస్పత్రికి తరలించారు.
నిందితులను గుర్తించేందుకు అధికారులు ముజఫర్‌పూర్ రైల్వే స్టేషన్, లక్నోలోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. ఈ ఘటనను మహిళా సంఘాలు తీవ్రంగా ఖండించాయి. ఇంత దారుణం జరిగినా.. ఇప్పటికీ నిందితులు ఎందుకు పట్టుకోలేదని ప్రశ్నిస్తున్నారు. ఇంత ఘోరం జరుగుతున్నా.. రైల్లో ఉన్నవారు ఏం చేస్తున్నారని నిలదీశారు.












Click it and Unblock the Notifications