Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

భార్య అక్రమ సంబంధం, చికెన్ కర్రీ, బిర్యానీ డిన్నర్ స్కెచ్ తో హత్య, ముందు జాగ్రత్త !

బెంగళూరు/ మంగళూరు: భార్య అక్రమ సంబంధం పెట్టుకుని ప్రియుడితో ఎంజాయ్ చేస్తోందని భర్తకు అనుమానం పెరిగిపోయింది. చివరికి భార్య అక్రమ సంబంధం పెట్టుకుందని భర్తకు తెలిసిపోయింది. భార్యతో నిత్యం గొడవలు పడిన భర్త అతని భార్య తీరుతో విసిగిపోయాడు. మనం ఇలాగే ఉంటే నా భార్య కారణంగా మన కుటుంబ పరువు పోతుందని మీరే ఏదో ఒకటి చెయ్యలని భర్త అతని అన్నతో పాటు వదిన దగ్గర బోరున విలపించారు. అంతే భర్త ఫ్యామిలీ ఎంట్రీ ఇవ్వడంతో అతని భార్య పైలోకాలకు వెళ్లిపోయింది.

కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లా కుమటా తాలూకా దేవిమనే ఘట్టలోని అటవి ప్రాంతంలోని లోయలో ఇటీవల ఓ మహిళ మృతదేహం లభ్యమైంది. ఆ మహిళ ఎవరు? ఆమెను ఎందుకు చంపారు? అంటూ పోలీసులకు ఈ హత్య సవాలుగా మారింది. ఎట్టకేలకు పోలీసులు మిస్టరీని ఛేదించి మహిళ హత్య కేసు నిందితులను పట్టుకుని జైలుకు పంపించారు. ఇంతకీ ఆ మహిళ హత్య ఎందుకు హత్య చేశారు అని పోలీసులు మీడియాకు చెప్పారు.

 illeagalaffair

భార్య తనూజా శీలంపై అనుమానం పెంచుకున్న ఆమె భర్త లోహిత్ అతని బంధువులతో కలిసి చికెన్ కర్రీలో నిద్రమాత్రలు వేసి ఊపిరాడకుండా చేసి ఆమెను హత్య చేశారని వెలుగులోకి వచ్చింది. అదే నెల 17వ తేదీన ఉత్తర కన్నడ జిల్లా కుమటా తాలూకాలోని దేవిమనే ఘట్ట ప్రాంతంలోని లోయలో ఓ మహిళ మృతదేహం లభ్యమైంది. వెంటనే రంగంలోకి దిగిన కుముట పోలీసులకు ఈ కేసు పెద్ద తలనొప్పిగా మారింది,

అయినప్పటికీ చాపకింద నీరులా దర్యాప్తు చేసిన పోలీసులు నిందితులను పట్టుకోవడంలో విజయం సాధించారు. కర్ణాటకలోని హవేరీకి చెందిన శిగ్గావికి చెందిన తనూజ లోహిత్ దొడ్డమణి (26) అనే మహిళ హత్యకు గురైందని పోలీసులు అన్నారు. భార్య తనూజ వేరే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుని ఎంజాయ్ చేస్తూ తనను మోసం చేస్తుందని అనుమానించి ఆమె భర్త లోహిత్ అతని సోదరుడు, బంధువులు ఆమెతో చాలా కాలం నుంచి గొడవ పడుతున్నారని, ఇటీవల ఆ గొడవలు ఎక్కువ అయ్యాయని పోలీసులు తెలిపారు.

chickenbiryani-

బిర్యానీ, చికెన్ కర్రీలో నిద్రమాత్రలు మిక్స్:తనూజ తీరుతో తమ కుటుంబ పరువు పోతుందని భావించిన భర్త లోహిత్ అతని అన్నయ్య, బంధువులతో కలిసి తనూజా హత్యకు ప్లాన్ చేశారు. ఇదే నెల 16వ తేదీన లోహిత్ కుటుంబ సభ్యులు ఇంట్లో బిర్యానీ, చికెన్ కర్రీ చేశారు. తనూజను డిన్నర్‌ కు రావాలని ఆమె భర్త లోహిత్ అన్న మహేష్ కుటుంబ సభ్యులు చెప్పారు. తనూజ వారి ఇంటికి డిన్నర్ కు వెళ్లింది. తనూజకు భోజనంలో, చికెన్ లో, బిర్యానీలో నిద్రమాత్రలు కలిపి వడ్డించారు.

భోజనం చేసిన తరువాత తనూజ నిద్రపోయింది. ఆ తర్వాత సాక్ష్యాలను ధ్వంసం చేయాలనే ఉద్దేశంతో ఆమె మెడకు చుడీదార్ వేల్‌తో గొంతు బిగించి చంపేశారు. ముందుగా సిద్దం చేసుకున్న వాహనంలో తనూజ శవం తీసుకెళ్లి ఉత్తర కన్నడ జిల్లా కుమట-శిరసి రహదారిలోని దేవీమనే ఘట్ట రోడ్డు పక్కనే ఉన్న పెద్ద లోయలో అర్దరాత్రి తనూజ మృతదేహాన్ని విసిరేశారని ఉత్తర కన్నడ జిల్లా ఎస్పీ విష్ణువర్ధన్ మీడియాకు చెప్పారు.

 deadbody

ఈ కేసులో శిగ్గావికి చెందిన మహేష్ దొడ్డమణి (36), కావ్య అమిత్ గోఖ్ లే (20), నీలక్క చంద్రప్ప (50), గౌరమ్మ మల్లేష్ (40), ముండగోడికి చెందిన అమిత్ గోఖలే (26) అరెస్టయ్యారని ఎస్పీ విష్ణువర్దన్ వివరించారు. వివాహం చేసుకున్న భర్త లోహిత్ తో జీవితాంతం జీవించాల్సిన తనూజ అక్రమ సంబంధం పెట్టుకుని ఆమె భర్త కుటుంబ సభ్యుల చేతిలో హత్యకు గురికావడం ఆ ప్రాంతంలో కలకలం రేపింది.

భార్య తనూజ శీలంపై అనుమానం పెంచుకున్న లోహిత్ అతని కుటుంబ సభ్యులతో కలిసి భార్యను హత్య చేసి మృతదేహాన్ని దట్టమైన అడవిలోని లోయలో పడేసి పరారయ్యాడు. అయితే తాము సురక్షితంగా కేసు నుంచి తప్పించుకుంటామని భావించిన హంతకులు చివరికి వారం రోజుల లోపే పోలీసులకు చిక్కిపోయారు. తనూజను హత్య చేసిన అందరిని జైలులో పెట్టారు. కుటుంబ పరువు కోసం చికెన్ కర్రీ స్కెచ్ తో మహిళను హత్య చేసిన నిందితులు ఇప్పుడు కటకటాలు లెక్కపెడుతున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+