girlfriend: భర్తను వదిలేసి ప్రియుడితో కాపురం, డ్రగ్స్ సేవించే వియంలో, మంటల్లో లేడీ ?

డ్రగ్స్ తీసుకునే విషయంలో సహజీవనం చేస్తున్న ఇద్దరి మధ్య గొడవ జరగడంతో మహిళకు ఆమె ప్రియుడు నిప్పుంటించాడు. ఆరేళ్ల క్రితం భర్తను విడిచిపెట్టి ప్రియుడితో కలిసి ఆమె సహజీవనం చేస్తోంది.

న్యూఢిల్లీ/బెంగళూరు: డ్రగ్స్ తీసుకునే విషయంలో సహజీవనం చేస్తున్న ఇద్దరి మధ్య గొడవ జరగడంతో మహిళకు ఆమెతో లివ్ ఇన్ రిలేషన్ షిప్ కొనసాగిస్తున్న ప్రియుడు నిప్పుంటించాడు. మంటల్లో తీవ్రంగా గాయపడిన మహిళను ఎయిమ్స్‌లోని అత్యవసర విభాగంలో చేర్చారు. అయితే చికిత్స ఫలించక మహిళ మృతి చెందింది. మృతురాలికి అప్పటికే వివాహమైందని, ఆరేళ్ల క్రితం భర్తను విడిచిపెట్టి ప్రియుడితో కలిసి సహజీవనం చేస్తోందని వెలుగు చూసింది. మహిళ హత్యతో ఆమె ఇద్దరు పిల్లలు రోడ్డునపడ్డారు.

 ప్రియుడితో కాపురం

ప్రియుడితో కాపురం

న్యూఢిల్లీలో నివాసం ఉంటున్న 28 ఏళ్ల మహిళ ఆమె భర్తకు విడాకులు ఇచ్చి ప్రియుడు మోహిత్ తో కలిసి సహజీవనం చేస్తోంది. ఇదే నెల ఫిబ్రవరి 10న నిందితుడు మోహిత్ అతని స్నేహితురాలితో కలిసి డ్రగ్స్ తీసుకుంటున్నాడు. మళ్లీ డ్రగ్స్ తీసుకోవాలని ప్రియుడు మోహిత్ ఒత్తిడి చెయ్యడంతో ఆ మహిళ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆ సందర్బంలో డ్రగ్స్ మత్తులో ఉన్న మోహిత్ కోపోద్రిక్తుడైన ప్రియురాలి మీద టర్పెంటైన్ ఆయిల్ పోసి నిప్పంటించాడు. తీవ్రంగా గాయపడిన ఆమెను ఎస్‌జీఎం ఆస్పత్రిలో చేర్పించారు.

 కాలిపోయిన ప్రియురాలు

కాలిపోయిన ప్రియురాలు

ఫిబ్రవరి 11న అమన్‌విహార్‌ పోలీస్‌ స్టేషన్‌కు సమాచారం అందించారు. ఒక మహిళ కాలిన గాయాలతో ఎస్ జీఎం ఆసుపత్రిలో చేరిందని ఆసుపత్రి సిబ్బంది పోలీసులకు చెప్పారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఆస్పత్రికి చేరుకుని విచారించారు. బాధితురాలి వాంగ్మూలం తీసుకునేందుకు కూడా ప్రయత్నించారు. అయితే ఆమె స్టేట్‌మెంట్ తీసుకోవడానికి పోలీసులకు సాధ్యం కాలేదని తెలిసింది. మహిళ పరిస్థితి మరింత విషమించడంతో ఆమెను ఎస్‌జిఎం ఆసుపత్రి నుండి సఫ్ద్రుజంగ్ ఆసుపత్రికి తరలించి అక్కడి నుంచి మళ్లీ మెరుగైన చికిత్స కోసం ఎయిమ్స్ అత్యవసర విభాగానికి తరలించారు. చికిత్స విఫలమై మహిళ చనిపోయిందని పోలీసులు అన్నారు.

 ప్రియుడికి పోయేకాలం వచ్చింది

ప్రియుడికి పోయేకాలం వచ్చింది

బాధితురాలు తన మొదటి భర్తను విడిచిపెట్టి గత ఆరు సంవత్సరాలుగా మోహిత్ అనే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుని పెళ్లి చేసుకోకుండానే అతనితో లివ్ ఇన్ రిలేషన్‌షిప్‌లో జీవిస్తున్నట్లు విచారణలో తేలిందని పోలీసులు అన్నారు. ప్రియుడి చేతిలో హత్యకు గురైన మహిళకు 28 ఏళ్లు ఉంటుందని, ఆమె ఓ ఫ్యాక్టరీలో ఉద్యోగం చేస్తోందని పోలీసులు తెలిపారు. ఆమెకు ఇద్దరు పిల్లలు ఉన్నారని పోలీసులు అన్నారు. ఆమె మొదటి భర్తతో కాపురం చెయ్యడంతో ఎనిమిదేళ్ల కుమారుడు ఉన్నాడని, మోహిత్ తో కాపురం చెయ్యడంతో నాలుగేళ్ల కుమార్తె ఉందని పోలీసులు తెలిపారు. డ్రగ్స్ కు బానిస అయిన మోహిత్ ను పోలీసులు అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+