Lady: ముగ్గురు మొగుళ్లు, ఎవరి చేతిలో హత్యకు గురైయ్యిందంటే, గ్యాప్ లేకుండా మూడో పెళ్లితో ?, ఫినిష్ !
చెన్నై/ తిరుప్పూర్: వివాహం చేసుకున్న మహిళ ఆమె భర్తతో కాపురం చేసి ఇద్దరు పిల్లలకు తల్లి అయ్యింది. భర్త అనారోగ్యంతో చనిపోయాడు. తరువాత భార్య ఇద్దరు పిల్లలతో కలిసి నివాసం ఉండేది. ఇదే సందర్బంలో మరో వ్యక్తిని ఆమె వివాహం చేసుకుంది. రెండో భర్తతో కాపురం చేస్తున్న మహిళ బయట ఎక్కువగా తిరుగుతున్నది. ఇదే సందర్బంలో రెండో భర్తకు గుడ్ బాయ్ చెప్పిన భార్య మరో ప్రాంతానికి మకాం మార్చింది. ముచ్చటగా ఆమె మూడో పెళ్లి చేసుకుంది. మూడో భర్తతో కాపురం చేస్తున్న మహిళ దారుణ హత్యకు గురికావడం కలకలం రేపింది.

మహిళ శవంతో షాక్
తమిళనాడులోని తిరుపూర్ జిల్లాలోని టెక్కలూరులోని రోడ్డు పక్కన పాడుపడిన ఇంటిలో ఓ మహిళ మృతదేహం ఉందని పోలీసులకు సమాచారం అందింది. దీంతో అవినాసి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఇంటిలో పరిశీలించారు. మహిళ తలపై కొట్టి ఆమెను హత్య చేశారని పోలీసులు గుర్తించారు. మహిళ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

భర్త చనిపోయాడు
హత్యకు గురైన మహిళ టెక్కలూరులోని మహాలక్ష్మి నగర్‌కు చెందిన బాగుల్ భార్య సుకన్య (32) అని పోలీసుల విచారణలో తేలింది. కొన్ని సంవత్సరాల క్రితం ఓ వ్యక్తిని సుకన్య వివాహం చేసుకుంది. సుకన్య దంపతులకు కూతురు, కొడుకు ఉన్నారు. సుకన్య భర్త కొన్ని సంవత్సరాల క్రితం అనారోగ్యంతో చనిపోయాడు. తరవాత సుకన్య ఆమె కొడుకు, కూతురుతో కలిసి వేరే ప్రాంతంలో ఉంటున్నది.

రెండో పెళ్లి చేసుకుంది
ఒంటరిగా ఉంటున్న సుకన్యకు రెండు సంవత్సరాల క్రితం బాగుల్ అనే వ్యక్తితో పరిచయం అయ్యింది. తరువాత సుకన్య, బాగుల్ ను రెండో పెళ్లి చేసుకుంది. తరువాత రెండో భర్త బాగుల్ తో సుకన్య కాపురం చేస్తోంది. కొంతకాలం నుంచి బాగుల్, సుకన్య దంపతుల మద్య అభిప్రాయబేధాల రావడంతో గొడవలు మొదలైనాయి. బాగుల్ కు అతని భార్య సుకన్య మీద అనుమానం ఎక్కువ అయ్యింది.

ముచ్చటగా మూడో పెళ్లి
గొడవలు ఎక్కువ కావడంతో బాగుల్, సుకన్య దంపతులు ఆరు నెలల క్రితం విడిపోయారు. రెండో భర్త బాగుల్ నుంచి విడిపోయిన సుకన్య కోయంబత్తూరులోని కరుమత్తంపట్టి సమీపంలోని రాయర్‌పాళయం నివాసి శరవణకుమార్‌తో పరిచయం పెంచుకుని అతనితో అక్రమ సంబంధం పెట్టుకుంది, మూడో ప్రియుడు శరవణకుమార్ తో కొంతకాలం ఎంజాయ్ చేసిన సుకన్య ఆరు నెలల క్రితం అతన్ని మూడో పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం మూడో భర్త శరవణకుమార్ తో సుకన్య సహజీవనం చేస్తోంది.

నీ భార్య శవం అక్కడ పడింది చూడురా
ఉదయం శరవణకుమార్ పీకలదాక లిక్కర్ తాగేసి మద్యం మత్తులో సుకన్య రెండో భర్త బాగుల్‌కు ఫోన్ చేసి నీ మాజీ భార్య సుకన్యను నేను చంపేశానని, ఆమె మృతదేహం టెక్కలూరు సమీపంలోని పాడుపడిన ఇంటి పక్కన పడిఉందని, నువ్వు వెళ్లి శవం తీసుకోవాలని చెప్పాడు. హడలిపోయిన సుకన్య రెండో భర్త బాగుల్ వెంటనే అవినాసి పోలీసులకు సమాచారం అందించాడు.

ఇంత తిరిగిన లేడీ మూడో భర్త చేతిలో ?
పోలీసులు సుకన్య మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తిరుపూర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న శరవణకుమార్ కోసం గాలిస్తున్నారు. అలాగే ఘటనా స్థలంలో హత్యకు ఉపయోగించిన ఇనుప రాడ్ ను స్వాధీనం చేసుకుని విచారణ జరుపుతున్నామని పోలీసులు తెలిపారు.
-
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ!












Click it and Unblock the Notifications