వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మృత్యువు ఒడిలోకి వెలుతు అన్ని అవయవాలు దానం చేసిన టీచర్

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: మృత్యువుతో పోరాడుతున్న మహిళ మరి కొందరికి పునర్జ్మనిచ్చి పైలోకాలకు వెళ్లిపోయారు. బుధవారం బెంగళూరులోని ఐదు ఆసుపత్రులలో ఐదు మందికి శాస్ర్త చికిత్స ద్వార అవయవాలు అమర్చారు. ఎందరికో ఆదర్శంగా నిలిచిని శోభా ఆమె కుటుంభానికి మాత్రం కన్నీరు మిగిల్చి వెళ్లారు.

ఆంధ్రప్రదేశ్- కర్ణాటక సరిహద్దులోని చిత్తూరు జిల్లా శివార్లలో బంగారుపేట తాలుకా కుప్పస్వామి లేఔట్ లో (కర్ణాటక) సోమశేఖర్, శోభా దంపతులు నివాసం ఉంటున్నారు. శోభా కుందుహళ్ళి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా ఉద్యోగం చేస్తున్నారు. నెల క్రితం నుండి శోభా తీవ్రమైన తలనోప్పితో బాధపడుతున్నారు.

స్థానిక ఆసుపత్రిలో శోభా చికిత్స చేయించుకున్నారు. నెల నుండి మందులు ఉపయోగించినా తల నోప్పి మాత్రం తగ్గలేదు. గత ఆదివారం ఇంటిలో ఉన్న శోభా ఒక్క సారిగగా కాలు జారి కిందకు పడిపోయి స్పృహ కొల్పోయారు. వెంటనే కుటుంబ సభ్యులు శోభాను కోలారులోని జాలప్ప ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ఆమెకు చికిత్స చేశారు.

a women in karnataka donated her eyes kidney as her brain ded dead

సోమవారం వరకు శోభాకు అన్ని పరిక్షలు చేశారు. అయినా ఆమెకు చలనం రాలేదు. జాలప్ప ఆసుపత్రి వైద్యులు శోభా భర్త సోమశేఖర్ ను పిలిపించి వెంటనే బెంగళూరులోని బీజీఎస్ గ్లోబల్ ఆసుపత్రికి తీసుకు వెళ్లి చికిత్స చేయించాలని సూచించారు.

వెంటనే శోభాను బెంగళూరులోని బీజీఎస్ గ్లోబల్ ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు శోభాకు అన్ని పరిక్షలు చేశారు.మెదడులో రక్తం గూడు కట్టిందని ఆమె బ్రతికే అవకాశాలు లేవని వైద్యులు గుర్తించారు. ఇదే విషయాన్ని శోభా భర్త సోమశేఖర్ కు చెప్పారు. సోమశేఖర్ తన భార్య అవయవాలు దానం చెయ్యాలని నిశ్చయించుకున్నాడు.

బుధవారం శోభా గుండె, రెండు కిడ్నీలు, రెండు కళ్లు, కాలేయం, ఊపిరితిత్తులు దానం చేశారు. బీజీఎస్ ఆసుపత్రిలో ఒక కిడ్నీ, ఇంకోక కిడ్ని సెయింట్ జాన్స్ ఆసుపత్రిలో ఇద్దరు రోగులకు శాస్త్ర చికిత్స చేసి అమర్చారు. లివర్ ను బీజీఎస్ ఆసుపత్రిలో, గుండెను నారాయణ హృదయాలయలో, రెండు కళ్లను నారాయణ నేత్రాలయాలో బాధితులకు అమర్చారు. ఐదు శాస్త్ర చికిత్సలు సక్సస్ అయ్యాయి.

సోమశేఖర్ సోంత ఊరు తుమకూరు సమీపంలోని క్యాతసంద్ర. సిద్దగంగ మఠం దగ్గర శోభ అంత్యక్రియలు నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు తెలిపారు.

English summary
a women in karnataka donated her eyes kidney as her brain ded dead
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X