వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రక్త సంబంధమంటే ఇదీ: తల్లి కోసం 27ఏళ్లుగా.. ఎట్టకేలకు ఇద్దరూ కలిశారు..

చిన్నప్పుడే కన్నవాళ్లకు దూరమై.. దేశం కానీ దేశం వెళ్లిపోయాక.. మళ్లీ తమ మూలాలను వెతుక్కుంటూ వెనక్కి వచ్చేవారు చాలా అరుదు. కానీ ఒక ఎరుక అంటూ వచ్చాక.. కన్నవారిని చూడాలన్న తాపత్రయం కొంతమందిని ఎంతదూరమైనా నడ

|
Google Oneindia TeluguNews

ముంబై: చిన్నప్పుడే కన్నవాళ్లకు దూరమై.. దేశం కానీ దేశం వెళ్లిపోయాక.. మళ్లీ తమ మూలాలను వెతుక్కుంటూ వెనక్కి వచ్చేవారు చాలా అరుదు. కానీ ఒక ఎరుక అంటూ వచ్చాక.. కన్నవారిని చూడాలన్న తాపత్రయం కొంతమందిని ఎంతదూరమైనా నడిపిస్తుంది. ఇలాంటి కోవలోకి వస్తారు భారత సంతతికి చెందిన స్వీడన్ యువతి నీలాక్షి ఎలిజబెత్ జోరెండాల్.

దాదాపు 41ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ అనంతరం ఆమె తన కన్నతల్లిని కలుసుకున్నారు. 14ఏళ్ల ప్రాయంలో తొలిసారి తన కన్నతల్లి గురించి తెలుసుకున్న ఆమె.. 17ఏళ్ల వయసు నుంచే తల్లిని వెతకడం ప్రారంభించింది. కానీ అప్పట్లో ఆమె చేసిన ప్రయత్నాలన్ని విఫలమయ్యాయి. అయితే తల్లి ఆచూకీని ఎలాగైనా కనిపెట్టాలన్న ధ్యేయంతో పట్టువిడవకుండా ప్రయత్నించి.. చివరకు తల్లి చెంతకు చేరింది ఎలిజబెత్.

a women reunion with her mother after 41years

1973లో మహారాష్ట్రకు చెందిన యవాత్మల్ అనే మహిళ ఎలిజబెత్ కు జన్మనిచ్చింది. అయితే అప్పటికే ఆమె భర్త చనిపోయాడు. వ్యవసాయ కూలీ పనులు చేసుకుని జీవించే యవాత్మల్.. పాపకు మూడేళ్ల వయసున్న సమయంలో పుణే సమీపంలోని కెడ్గావ్ లో ఉన్న పండిత రమాబాయి ముక్తి మిషన్ అనాథశ్రమంలో వదిలి వెళ్లింది.

ఆ తర్వాత ఓ స్వీడన్ జంట ఆ పాపను దత్తతకు తీసుకుంది. 1976లో దత్తత తల్లిదండ్రులు పాపను స్వీడన్ తీసుకెళ్లిపోయారు. ఎలిజబెత్ అని పేరు పెట్టారు. 1990లో తొలిసారిగా ఎలిజబెత్ కు ఆమె కన్నతల్లి గురించి చెప్పారు. అదే ఏడాది 17ఏళ్ల వయసులో పుణేకి వచ్చిన ఎలిజబెత్.. తల్లి గురించి ఆరా తీసింది. కానీ ఎక్కడా ఆమె ఆచూకీ దొరకలేదు.

అలా నాలుగైదు విఫలయత్నాల తర్వాత పుణేకు చెందిన ఓ ఎన్జీవో సంస్థ ఆమెకు సహాయం చేసింది. ఆ తర్వాత ఆరో ప్రయత్నంలో గానీ ఆమెకు తల్లి జాడ దొరకలేదు. గత శనివారం అనారోగ్యం కారణంగా ఓ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న యవాత్మల్ ను ఎలిజబత్ కలుసుకుంది. తల్లిని చూసిన ఆనందంలో కన్నీటి పర్యంతమైంది. దీంతో 27ఏళ్ల నిరీక్షణకు తెరపడినట్లయింది.

కాగా, ఎలిజబెత్ ను అనాథశ్రమంలో వదిలిన తర్వాత యవాత్మల్ మరో వివాహం చేసుకోగా.. ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. తల్లితో పాటు చెల్లి, తమ్ముడి బాధ్యతను కూడా ఇప్పుడు తానే తీసుకుంటానంటుంది ఎలిజబెత్. ఏదేమైనా ఎలిజబెత్ నిరీక్షణకు.. తల్లిని కలుసుకోవడానికి ఆమె చేసిన ప్రయత్నాలకు ఎవరైనా సరే చలించకుండా ఉండలేరు.

English summary
It was an emotional moment for Nilakshi Elizabeth Jorendal, the India-born Swedish national, as she met her ailing biological mother in Yavatmal.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X