హోటల్ లో ఏం కష్టం వచ్చిందో ?, 19వ అంతస్తు నుంచి దూకి ?, అసలు ఏం జరిగిందో తెలీదు !
బెంగళూరు నగరంలోని రేస్‌కోర్స్ రోడ్డులోని ఓ ప్రతిష్టాత్మక హోటల్ 19వ అంతస్తు నుంచి దూకి ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలంరేపింది. తమిళనాడు రాష్ట్రం సేలంకు చెందిన శరణ్ కుమార్ అలియాస్ శరణ్ (27) అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. మధ్యాహ్నం 2.30 గంటల ప్రాంతంలో బెంగళూరులోని రేస్‌కోర్స్ రోడ్డులోని రినైసన్స్ హోటల్‌లో ఈ ఘటన చోటుచేసుకుందని పోలీసులు తెలిపారు.
మృతుడు శరణ్ వివరాలను గుర్తించి అతని తల్లిదండ్రులకు సమాచారం అందించామని బెంగళూరు పోలీసు అధికారులు తెలిపారు.

మృతుడు శరణ్‌కుమార్ ఈనెల 6వ తేదీన రినైసన్స్ హోటల్‌కు వచ్చి ఒక గది అద్దెకు తీసుకున్నాడు. తరువాత గది ఖాళీ చేస్తానని శరణ్ చెప్పిన గడుపు ముగిసిపోయిందని తెలిసింది. అయితే శరణ్ కుమార్ మరో రెండు రోజులు ఉంటానని తరువాత హోటల్ సిబ్బందికి చెప్పాడు.
మధ్యాహ్నం 2.30 గంటల ప్రాంతంలో హోటల్‌లోని 19వ అంతస్తు బాల్కనీ మీదకు వెళ్లిన శరణ్ కుమార్ అక్కడి నుంచి కిందకు దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.
పెద్ద శబ్ధం రావడంతో హోటల్ సిబ్బంది బయటకు వచ్చి చూడగా శరణ్ కుమార్ మృతదేహం రక్తపు మడుగులో పడి ఉండటంతో హోటల్ సిబ్బంది హడలిపోయారు. శరణ్ శవం చూసిన హోటల్ సిబ్బంది వెంటనే హైగ్రౌండ్ పోలీసులకు సమాచారం అందించారు.
విషయం తెలుసుకున్న హైగౌండ్స్ స్టేషన్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. శరణ్ కుమార్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. శరణ్ కుమార్ గురించి పూర్తి సమాచారం ఇంకా తెలియడంలేదని పోలీసులు అంటున్నారు, శరణ్ కుమార్ ఆత్మహత్యకు సరైన కారణం తెలియరాలేదు. శరణ్ కుమార్ బస చేసిన గదిలో ఇప్పటివరకు డెత్ నోట్ చిక్కలేదని పోలీసులు అన్నారు. శరణ్ కుమార్ తల్లిదండ్రులను విచారణ చేస్తే మరింత సమాచారం అందుతుందని పోలీసులు అన్నారు. హైగౌండ్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు బెంగళూరు పోలీసు అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications