ఇన్ స్టాగ్రామ్ ఆంటీతో ఇన్ స్టాల్ మెంట్ లో ఆడుకున్న బాయ్ ఫ్రెండ్, లక్షల్లో డబ్బు, నగలు లూటీ !

ఇన్ స్టాగ్రామ్ లో అపరిచిత వ్యక్తులతో స్నేహం పెంచుకోవడానికి ముందు జాగ్రత్తగా ఉండాలని చాలా మంది పదేపదే చెబుతుంటారు. పరిచయం లేనివాళ్లతో స్నేహం చేస్తే మొదటికే మోసం వస్తుందని మరోసారి వెలుగు చూసింది. నమ్మించి స్నేహం చేస్తే బ్లాక్ మెల్‌ చేసేందుకు కొందరు వెనుకాడరని తెలుసుకోవాలి. ఇన్ స్టాగ్రామ్ స్నేహితుడిని నమ్మిన బెంగళూరు వివాహిత మహిళ ఇప్పుడు లబోదిబో అంటోంది.

వివాహిత మహిళ పర్సనల్ ఫోటోలతో ఆమెను బ్లాక్ మెయిల్ చేసిన ఘటన బెంగళూరులో వెలుగు చూసింది. ఇన్‌స్టాగ్రామ్ స్నేహితుడే ఇప్పుడు ఆ మహిళకు యముడు అయ్యాడు. ఇన్ స్టాగ్రామ్‌లో పరిచయం అయిన మహిళను బ్లాక్ మెయిల్ చేసి ఆమెను చిత్రహింసలకు గురి చేసి ఆమె నుంచి రూ 8 లక్షల డబ్బుతో పాటు 240 గ్రామల బంగారు నగలు లాక్కొన్న నిందితుడు ఆమెకు సినిమా చూపించాడు.

A young man from Bengaluru who blackmailed his Instagram girlfriend and stole 8 lakhs
బెంగళూరులోని వీవీ పురం పోలీస్ స్టేషన్ లో బ్లాక్ మెయిల్ కేసు నమోదు అయ్యింది. ప్రస్తుతం బ్లాక్ మెయిల్ చేసిన నిందితుడు అన్బు అళగన్ అలియాస్ అన్బు అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు. ఇన్ స్టాగ్రామ్ లో బెంగళూరులో నివాసం ఉంటున్న వివాహిత మహిళ (39) చాలా యాక్టీవ్ గా ఉంటున్నదని పోలీసులు అన్నారు. ఇదే మహిళకు నిందితుడు అన్బు అళగన్ గాలం వేశాడు. ఇద్దరూ కొంతకాలం ఇన్ స్టాగ్రామ్ లో స్నేహం చేశారు.

అన్బు, ఆ వివాహిత మహిళ స్నేహం బలంగా పెనవేసుకుంది. తరువాత ఇద్దరూ శారీరక సంబంధం పెట్టుకుని ఎంజాయ్ చేశారని తెలిసింది. మహిళను నేరుగా కలుసుకోవడం మొదలుపెట్టిన నిందితుడు అన్బు అళగన్ ఆమెతో ఫోటోలు తీసుకున్నాడు. మహిళ నగ్న ఫోటోలు తీసిన అన్బు ఆ పోటోలను అడ్డం పెట్టుకుని ఆమెను బ్లాక్ మెయిల్ చేసాడు. నేను అడిగినంత డబ్బు నువ్వు ఇవ్వాలని అన్బు డిమాండ్ చెయ్యడం మొదలుపెట్టాడు.

A young man from Bengaluru who blackmailed his Instagram girlfriend and stole 8 lakhs

నేను అడిగిన డబ్బు నువ్వు ఇవ్వకపోతే నీ నగ్న పోటోలను మీ కుటుంబ సభ్యులకు చూపిస్తానని అన్బు ఆమెను బెదిరింపులకు గురి చేశాడు. తనకు నగ్నంగా వీడియో కాల్ చెయ్యాలని, తనతో నగ్నంగా వీడియో కాల్ లో మాట్లాడాలని ఆమెను బలవంతం చేసి బెదిరింపులకు పాల్పడ్డాడని ఆరోపణలు ఉన్నాయి. మహిళను బెదిరించి ఇప్పటి వరకు అనేకసార్లు రూ 8 లక్షలకు పైగా వసూలు చేశాడు. పనిలో పనిగా మహిళ దగ్గర ఉన్న 240 గ్రాముల బంగారు నగలు లూటీ చేశాడు.

ఇది చాలదు అన్నట్లు నిందితుడు మరో రూ 5 లక్షలు ఇవ్వాలని వివాహిత మహిళను బ్లాక్ మెయిల్ చేశాడని తెలిసింది. రోజురోజుకు అన్బు వేధింపులు ఎక్కువ కావడంతో బాధితురాలు వీవీపురం పోలీసులకు ఫిర్యాదు చేసింది. వివాహిత మహిళ ఫిర్యాదు చెయ్యడంతో కేసు నమోదు చేసిన పోలీసులు అన్బు అళగన్‌ ను అరెస్టు చేశారు. బెంగళూరులోని వీవీ పురం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+