Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఓటు వేసి ఫోటో తీసి వీడు ఏం చేశాడంటే ? పైత్యం నషాలానాకి ఎక్కింది, తిక్కకుదిరితే కాని!

2024 లోక్‌సభ ఎన్నికల రెండో దశ పోలింగ్‌ దేశంలోని అనేక ప్రాంతాల్లో కొనసాగుతోంది. కర్ణాటకలో తొలి దశ పోలింగ్‌ జరుగుతోంది. పోలింగ్‌ను విజయవంతం చేసేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేసినా అక్కడక్కడా ఈవీఎం యంత్రాల్లో లోపం కారణంగా కొన్నికొన్ని తప్పులు దొర్లుతున్నాయి. పలు ప్రాంతాల్లోని పోలింగ్ కేంద్రాల్లో కొందరు చట్టాన్ని ఉల్లంఘించారని వెలుగు చూస్తోంది.

కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలో ఇలాంటి ఘటన చోటుచేసుకుంది. పోలింగ్ కేంద్రం లోపలికి మొబైల్ ఫోన్లు తీసుకెళ్లడాన్ని అధికారులు నిషేదించారు. పోలింగ్ కేంద్రాల్లో మొబైల్ ఫోన్లను నిషేధించినా దక్షిణ కన్నడలోని పుత్తూరులోని ఓ పోలింగ్ కేంద్రంలో మాత్రం ఓ వ్యక్తి నియమాలు ఉల్లంఘించి పోలింగ్ బూత్ లోకి మొబైల్ ఫోన్ తీసుకెళ్లాడు. పుత్తూరు పోలింగ్‌ కేంద్రంలో ఓ యువకుడు ఓటు వేసిన తరువాత ఫొటోను క్లిక్‌ చేసి ఓటింగ్‌ సమయంలో తీసిన ఫొటోను వాట్సాప్‌ గ్రూప్‌లో షేర్‌ చేశాడు.

A young man took pictures while voting at the polling center and shared them on social media

కాంగ్రెస్ అభ్యర్థికి ఓటు వేస్తున్నట్లు ఫోటో తీసిన ఓ యువకుడు దానిని సోషల్ మీడియాలో షేర్ చెయ్యడంతో విపరీతంగా వైరల్ అయ్యింది. పుత్తూరుకు చెందిన కోటి-చెన్నై కంబాల గ్రూప్ కు అతను ఓటు వేసిన ఫోటోను షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ ఫోటో సర్వత్రా వైరల్ అవుతుండటం కలకలం రేపింది. పోలింగ్ బూత్ అధికారుల నిర్లక్ష్యంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలింగ్ కేంద్రంలో ఫోటో తీసిన యువకుడిని అరెస్టు చెయ్యాలని కొందరు డిమాండ్ చేస్తున్నారు.

కర్ణాటకలోని 14 లోక్ సభ నియోజక వర్గాలతో పాటు13 రాష్ట్రాల్లోని 88 లోక్‌సభ నియోజకవర్గాలకు నేడు ఓటింగ్ జరుగుతోంది. కేరళ 20, మధ్యప్రదేశ్ 6, మహారాష్ట్ర 8, రాజస్థాన్ 13, ఉత్తరప్రదేశ్ 8 స్థానాలతో సహా మొత్తం 88 లోక్‌సభ నియోజకవర్గాలకు రెండో దశ లోక్‌సభ ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. 88 లోక్ సభ నియోజక వర్గాల్లో పోలీసులు, ఎన్నికల అధికారులు కట్టుదిట్టమైనా భద్రతా ఏర్పాట్లు చేసినా ఇలాంటి సంఘటనలు జరగడంతో అధికారులు హడలిపోతున్నారు.

కర్ణాటకలోని ఉడిపి-చిక్కమగళూరు, దక్షిణ కన్నడ, హాసన్, చిత్రదుర్గ, తుమకూరు, కోలారు, చిక్కబళ్లాపురం, మండ్య, , మైసూర్-కొడగు, చామరాజనగర్, బెంగళూరు రూరల్, బెంగళూరు సౌత్, బెంగళూరు నార్త్, బెంగళూరు సెంట్రల్ లోక్‌సభ నియోజకవర్గాల్లో ఓటింగ్ జరుగుతోంది. పోలింగ్ కేంద్రంలో మొబైల్ తో ఫోటో తియ్యడమే కాకుండా తాను ఎవరికి ఓటు వేశాను అని బహిరంగంగా అందరికి తెలిసేలా, ఓటర్లను ప్రలోభాపెట్టేలా చేసిన యువకుడి కోసం దక్షిణ కన్నడ జిల్లా పోలీసులు గాలిస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+