చెట్టుకు యువకుడి శవం, ఆంటీతో అక్రమ సంబంధంతో మ్యాటర్ రివర్స్, రాత్రి ఏం జరిగింది ?
ఒకే ప్రాంతంలో నివాసం ఉంటున్న యువకుడికి, వివాహిత మహిళకు చాలాకాలం నుంచి పరిచయం ఉంది. స్నేహితులుగా ఉన్న మహిళ, ఆ యువకుడు తరువాత చనువు పెంచుకున్నారు. రానురాను ఆ ఇద్దరి చనువు అక్రమ సంబంధానికి దారితీసింది. మహిళతో అక్రమ సంబంధం విషయం ఊరు మొత్తం తెలిసిపోవడంతో కలకలం రేపింది. ఇదే సందర్బంలో యువకుడు అనుమానాస్పదంగా చెట్టుకు శవమై కనిపించాడు.
కర్ణాటకలోని యాదగిరి జిల్లా హోసహళ్లిలో ఓ యువకుడు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు కేసు నమోదు చేశారు. చంద్రశేఖర్ (25) అనే యువకుడు అనుమానాస్పదంగా మృతి చెందాడని అతని కుటుంబ సభ్యులు అంటున్నారు. హొసహళ్లిలోని చెట్టుకు చంద్రశేఖర్ ఉరి వేసుకుని మృతి చెందినట్లు కనిపించాడని పోలీసులు అన్నారు. హొసహళ్లి గ్రామానికి చెందిన చంద్రశేఖర్ అదే ప్రాంతానికి చెందిన వివాహిత మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడనే ఆరోపణతో ఇటీవల కొందరు వ్యక్తులు అతన్ని చెట్టుకు కట్టేసి కొట్టినట్లు సమాచారం.

అయితే చంద్రశేఖర్ ది ఆత్మహత్య కాదని, హత్యేనని మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఓ మహిళతో అనైతిక సంబంధం పెట్టుకున్నాడనే అనుమానంతో కొద్ది రోజుల క్రితం చంద్రశేఖర్ ను గ్రామంలోని చెట్టుకు తాడుతో కట్టేసి కొందరు వ్యక్తులు కొట్టారు చంద్రశేఖర్ తో పాటు అతని కుటుంబ సభ్యులపై కూడా దాడికి పాల్పడ్డారు. ఈ అవమానం భరించలేక ఎనిమిది మంది పేర్లతో డెత్ నోట్ రాసిన చంద్రశేఖర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడని పోలీసులు అంటున్నారు.

ఈ ఘటన తర్వాత నిందితుల కుటుంబ సభ్యులు అందరూ పరారయ్యారు. అయితే చంద్రశేఖర్‌ను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించి ఉంటారని అతని కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. చంద్రశేఖర్ హత్యకు గురైవుంటే అతను డెత్ నోట్ ఎలా రాసి ఉంటాడు అని పోలీసులు అంటున్నారు. ఈ ఘటనపై యాదగిరి రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు నమోదైంది.












Click it and Unblock the Notifications