మద్యం మత్తులో ఇంటికి వెలుతున్న ఆంటీ, లాక్కెళ్లి అత్యాచారం చేసి చంపేశాడు, సీసీటీవీ కెమెరాల్లో !
రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న మహిళను నిర్మాణంలో ఉన్న భవనంలోకి బలవంతంగా తీసుకెళ్లి తరువాత ఆమెపై అత్యాచారం చేసి హత్య చేసిన పెయింటర్‌ను బెంగళూరులోని అమృతల్లి పోలీసులు అరెస్టు చేశారు. మద్యం మత్తులో ఉన్న మహిళను ఎత్తుకెళ్లి ఆమె మీద అత్యాచారం చేసిన హత్య చేసిన బెంగళూరులోని జక్కూరుకు చెందిన సచిన్ అలియాస్ కరణ్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు.
కర్ణాటకలోని రాయచూరు జిల్లా దేవదుర్గ తాలూకాకు చెందిన 53 ఏళ్ల మహిళపై బెంగళూరులో అత్యాచారం చేసి హత్య చేశారని పోలీసు అధికారులు తెలిపారు. మృతురాలి కుమారుడి ఫిర్యాదు మేరకు సాంకేతిక సమాచారం మేరకు బెంగళూరు పోలీసులు దర్యాప్తు చేసి నిందితుడు సచిన్ ను అదుపులోకి తీసుకుని విచారణ చెయ్యగా మ్యాటర్ మొత్తం బయటకు వచ్చిన పోలీసు అధికారులు తెలిపారు.

బెంగళూరులోని జక్కూరులో నివసించే సచిన్ పెయింటింగ్ పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. రాత్రి 8.30 గంటల ప్రాంతంలో వరదరాజులు లేఔట్ లోని 8వ క్రాస్ రోడ్డు సమీపంలోని ఓ బార్‌లో సచిన్ మద్యం సేవిస్తున్నాడు. అదే సమయంలో మహిళ కూడా మద్యం తీసుకునేందుకు అదే బార్ దగ్గరకు వెళ్లింది. తరువాత లిక్కర్ తీసుకున్న ఆమె బార్ లోని మరో గేట్ దగ్గర మద్యం సేవించిందని తెలిసింది. ఆదే సమయంలో మహిళ మద్యం సేవిస్తున్న విషయం సచిన్ గమనించాడు.
మహిళ మద్యం సేవించి బార్ నుంచి బయటకు వస్తుండగా నిందితుడు సచిన్ ఆమెను గమనించి తరువాత ఆమెను ఫాలో అయ్యాడు. అనంతరం మార్గం మధ్యలో రోడ్డు పక్కన నిర్మాణంలో ఉన్న కట్టడంలోకి ఆ మహిళను బలవంతంగా తీసుకెళ్లిన సచిన్ తరువాత ఆమె మీద అత్యాచారం చేశాడు. మద్యం మత్తులో ఉన్న మహిళ మీద అత్యాచారం చేసి కామం తీర్చుకున్న నిందితుడు తరువాత ఆమె మ్యాటర్ బయటకు చెబుతుందని భయపడ్డాడు.
అనంతరం ఆమె చీరతోనే ఆమెకు ఊపిరాడకుండా చేసి హత్య చేసిన సచిన్ ఆ కట్టడంలో నుంచి బయటకు వచ్చి అక్కడి నుంచి పరారయ్యాడు.
అర్దరాత్రి అయినా తల్లి ఇంటికి రాకపోవడంతో మృతురాలి ఇద్దరు కుమారులు ఇరుగుపొరుగున ఆమె కోసం వెతికారు. ఎక్కడ చూసినా తల్లి కనిపించకపోవడంతో ఆమె కొడుకులు ఆందోళన చెందారు. మరుసటి రోజు ఉదయం వరదరాజు లేఔట్ లో నిర్మాణంలో ఉన్న భవనం సమీపంలో గుర్తుతెలియని మహిళ మృతదేహాన్నిగుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.

ఇదే సమయంలో తల్లి కోసం వెతుకుతున్న మృతురాలి కుమారుడికి ఆ సమాచారం అందించారు. వెంటనే ఆ భవనం దగ్గరకు వెళ్లి మృతదేహాన్ని చూసి ఆమె తన తల్లి అని గుర్తించిన కొడుకు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మృతుడి కుమారుడు ఫిర్యాదు చేయడంతో వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు బార్‌లోని సీసీటీవీ కెమెరాలో నిందితుడు సచిన్ ను గుర్తించారు. బార్ దగ్గర నుంచి బాధితురాలిని సచిన్ వెంబడిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
సీసీటీవీల్లో చిక్కిన సమాచారం మేరకు నిందితుడు సచిన్ ను అరెస్టు చేసి విచారించగా నిందితుడు ఆ మహిళ మీద అత్యాచారం చేసి హత్య చేసిననట్లు అంగీకరించాడని బెంగళూరు పోలీసు అధికారులు తెలిపారు. మద్యం మత్తులో ఉన్న మహిళ మీద అత్యాచారం చెయ్యడమే కాకుండా ఆమెను చంపేసిన సచిన్ కు గతంలో ఏమైనా నేర చరిత్ర ఉందా అని ఆరా తీస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications