ఫ్రెండ్స్ తో పార్టీకి వెళ్లాడు, తల్లికి ఏం చెప్పాడంటే ?, బెంగళూరు పార్క్ లో ఇలా కనిపిస్తాడని ?

కుటుంబ సభ్యులు వయసులో ఉన్న యువతి, యువకులకు బుద్దిమాటలు చెప్పడం ఇప్పుడు పెద్ద తలనొప్పిగా తయారైయ్యింది. పిల్లలకు బుద్దిమాటలు చెబితే ఎప్పుడు ఎలాంటి పరిస్థితులు ఎదురౌతాయో అని కుటుంబ సభ్యులు భయపడిపోతున్నారు. నూతన సంవత్సరం వేడుకలకు వెళ్లిన యువకుడు నెల రోజుల తరువాత చివరికి శవమై కనిపించిన ఘటన బెంగళూరులో కలకలం రేపింది.

బెంగళూరు నగరంలోని దొడ్డబొమ్మసంద్రలో ఈఘటన చోటుచేసుకుంది. దొడ్డబొమ్మసంద్ర పార్కులోని చెరువు ( సరస్సు) మధ్యలో యువకుడి మృతదేహం లభ్యమైంది. బెంగళూరులో నివాసం ఉంటున్న రాజేష్ (19) అనే యువకుడు అనుమానాస్పద స్థితిలో శవమై కనిపించాడు. నూతన సంవత్సరం రోజున రాజేష్ అదృశ్యం అయ్యాడని బెంగళూరు లో మిస్సింగ్ కేసు నమోదు అయ్యిందని పోలీసు అధికారులు తెలిపారు.

A young man who went to a New Years party was found dead in a pond in Bengaluru Park a month later

రాజేష్ తల్లిదండ్రులు బెంగళూరులోని విద్యారణ్యపుర పోలీస్ స్టేషన్‌లో తమ కుమారుడు కనిపించడం లేదని జనవరి 2వ తేదీన ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం పోలీసులు యూడీఆర్ కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ ఘటనపై రాజేష్ తల్లిదండ్రులు వివరాలు వెళ్లడించారు. డిసెంబర్ 31వ తేదీ రాత్రి తమ స్నేహితులతో కలిసి న్యూ ఇయర్ పార్టీ చేసుకోవాలని, స్నేహితులతో కలిసి నంది హిల్స్ కు వెళ్లాలని రాజేష్ అతని తల్లికి చెప్పాడు.

అయితే న్యూ ఇయర్ పార్టీకి వెళ్లొద్దని, రాత్రిపూట బయట తిరగడం అంత సురక్షితం కాదని రాజేష్ కు అతని తల్లి బుద్దిమాటలు చెప్పారు. దీంతో ఇంట్లోనే ఉంటానని రాజేష్ అతని తల్లికి చెప్పాడు. న్యూఇయర్ ముందు రోజు కొడుకు రాజేష్ అలా ఉండటం చూసి తట్టుకోలేని అతని తల్లి చివరకు పార్టీకి వెళ్లేందుకు అంగీకరించింది. రూ. 700 రూపాయలు కొడుకు రాజేష్ కు ఇచ్చిన అతని తల్లి సురక్షితంగా వెళ్లి రావాలని చెప్పింది.

A young man who went to a New Years party was found dead in a pond in Bengaluru Park a month later

ఆ తర్వాత ఇంటి నుంచి బయటకు వెళ్లి కొంత సేపటికి రాజేష్ తిరిగి అతని ఇంటికి వెళ్లాడు. తరువాత రాజేష్ ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయాడు. అయితే ఈ విషయాన్ని తన స్నేహితులకు చెప్పకుండా ఇంటి నుంచి బయటకు వచ్చిన రాజేష్ ఇకపై మీకు కనపడను, నా కోసం మీరు ఎదురుచూడకుడదని, అందరూ నన్ను క్షమించాలని స్నేహితులందరికీ మొబైల్ లో మెసేజ్ లు పెట్టినట్లు పోలీసుల విచారణలో తెలిసింది.

అయితే న్యూఇయర్ పార్టీ కోసం ఇంటి నుంచి బయటకు వెళ్లిన రాజేష్ తరువాత
ఇంటికి తిరిగిరాకపోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు కొడుకు స్నేహితులందరికి ఫోన్లు చేసి సమాచారం అందించారు. ఎక్కడ రాజేష్ అచూకి చిక్కకపోవడంతో అనంతరం తమ కుమారుడు రాజేష్ కనిపించలేదని అతని తల్లిదండ్రులు విద్యారణ్య పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అయితే నెల రోజుల తరువాత పార్క్ లోని సరస్సు మధ్యలో రాజేష్ మృతదేహం లభ్యం కావడం,తో అందరూ ఉలిక్కిపడ్డారు. రాజేష్ శవం కుళ్లిపోయిందని, అతను ఆత్మహత్య చేసుకున్నాడా ?, లేక వేరే కారణాలు ఏమైనా ఉన్నాయా ? అని ఆరా తీస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+