Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

woman: మంచి ఉద్యోగం, పెళ్లి కాకుండానే తల్లి అయ్యింది, అపార్ట్ మెంట్ మూడో అంతస్తులో నుంచి ?

న్యూఢిల్లీ/నోయిడా: ఓ తల్లి ఆమె ఇంటి మూడో అంతస్తులోని వాష్‌రూమ్ కిటికీలోంచి ఒకరోజు వయసున్న పసికందును కిందకు విసిరేసి చంపేసింది. ఈ కేసుకు సంబంధించి 20 ఏళ్ల తల్లిని పోలీసులు విచారణ చేసి అరెస్ట్ చెయ్యడానికి సిద్దం అవుతున్నారు. వివాహేతర సంబంధం కారణంగా తాను గర్భిణి అయ్యానని, తన ఇంట్లోనే మగబిడ్డకు జన్మనిచ్చానని, పెళ్లికాకుండానే తల్లి అయ్యాయనని ఈ సమాజం వేలు ఎత్తి చూపిస్తుందనే భయంతోనే తన బిడ్డను పై నుంచి కిందకు విసిరేసి హత్య చేసినట్లు ఆమె అంగీకరించింది. ప్రముఖ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న యువతి పెళ్లికాకుండా తల్లి అయ్యి ఇంత దారుణంగా ప్రవర్తించింది.

అపార్ట్ మెంట్ పక్కన

అపార్ట్ మెంట్ పక్కన

ఢిల్లీలోని జై అంబే అపార్ట్‌మెంట్ పరిసర ప్రాంతాల్లో చాలా కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. అపార్ట్ మెంట్ పక్కన రక్తపు మడుగులో పడి ఉన్న నవజాత శిశువును గురించిన స్థానికులు న్యూ అశోక్ నగర్ పోలీస్ స్టేషన్‌ అధికారులకు సమాచారం అందించారని ఢిల్లీ ఈస్ట్ డిప్యూటీ పోలీస్ కమిషనర్ అమృత గుగులోత్ మీడియాకు చెప్పారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని చిన్నారిని నోయిడాలోని మెట్రో ఆసుపత్రిలో చేర్చించారు. అప్పటికే చిన్నారి మృతి చెందినట్లు వైద్యులు చెప్పారు. చిన్నారి మృతదేహాన్ని లాల్ బహదూర్ శాస్త్రి ఆస్పత్రికి తరలించామని పోలీసు అధికారులు తెలిపారు.

ప్రతి ఇల్లు పరిశీలించిన పోలీసులు

ప్రతి ఇల్లు పరిశీలించిన పోలీసులు

ఈసంఘటనతో జై అంబే అపార్ట్ మెంట్ పరిసర ప్రాంతాల ప్రజలు హడలిపోయారు. చిన్నారి శవమై కనిపించిన స్థలం చుట్టూ ఉన్న పలు ఇళ్లను పోలీసులు తనిఖీ చేశారు. జై అంబే అపార్ట్ మెంట్ లోని ప్రతి ఫాట్ ను పోలీసులు పరిశీలించారు. ఒక ఇంటిని తనిఖీ చేసినప్పుడు ఆ ఇంటిలోని డస్ట్‌బిన్‌లో రక్తం మరకలు ఉన్న బట్టలు, న్యాప్ కిన్స్ కనిపించాయని, తరువాత అదే ఇంటిలో ఉన్న 20 ఏళ్ల యువతి ఆ బిడ్డను నేను మా ఇంటి వాష్ రూమ్ లోని కిటికీలో నుంచి విసరేశానని అంగీకరించిందని డీసీపీ మీడియాకు చెప్పారు.

ఇంట్లోనే కాన్ఫు అయ్యింది

ఇంట్లోనే కాన్ఫు అయ్యింది

సోమవారం ఇంట్లో ఆ యువతి మగబిడ్డకు జన్మనిచ్చిందని, వాష్‌రూమ్‌లోని కిటికీలోంచి పసికందును విసిరేసినట్లు ఆమె అంగీకరించిందని పోలీసులు తెలిపారు. యువతికి ఇంకా పెళ్లికాలేదని, వివాహం కాకుండానే బిడ్డను కనడంతో సమాజం తనను వేలెత్తి చూసిస్తుందనే భయంతో ఇలా చేశానని ఆ యువతి చెప్పిందని పోలీసులు అన్నారు. సమాజానికి భయపడి చిన్నారిని చంపేయాలని తాను నిర్ణయించుకున్నానని యువతి చెప్పిందని డీసీపీ మీడదియాకు చెప్పారు.

పెద్ద కంపెనీలో ఉద్యోగం చేస్తున్న యువతి

పెద్ద కంపెనీలో ఉద్యోగం చేస్తున్న యువతి

నోయిడాలోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఓ మహిళ మంచి ఉద్యోగం చేస్తోందని, అపార్ట్ మెంట్ లో మహిళ మాత్రమే ఒంటరిగా జీవిస్తుందా లేక ఎవరితోనైనా కలిసి జీవిస్తుందో అని ఆరా తీస్తున్నామని పోలీసు అధికారులు చెప్పారు. అనారోగ్యంతో ఉన్న యువతిని లాల్ బహుదూర్ శాస్త్రీ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నామని, ఆమె కోలుకున్న తరువాత ఆమెను అరెస్టు చేసి విచారణ చేస్తామని ఢిల్లీ ఈస్ట్ డిప్యూటీ పోలీస్ కమిషనర్ అమృత గుగులోత్ మీడియాకు చెప్పారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+