బ్యాంకులో ఉద్యోగం మానేసిన కిలాడీ లేడీ ఏం చేసిందంటే ? ఐటీ హబ్ నీళ్లు అలాంటివి మరి !
ఐటీ-బీటీ సిటీగా పేరుగాంచిన బెంగళూరులోని ఐసీఐసీఐ బ్యాంక్‌లో ఉద్యోగిని అయినప్పటికీ ఐటీ ఉద్యోగుల ల్యాప్‌టాప్‌లను దొంగిలించడం ఆమెకు అలవాటుగా మారిపోయింది. ప్రధానంగా పేయింగ్ గెస్ట్‌లు (పీజీలు), హోటళ్లలో భోజనం చేసేందుకు వెళ్లే వారి నుంచి ఐసీఐసీఐ మహిళా ఉద్యోగి ల్యాప్‌టాప్‌లను దొంగిలించేదని పోలీసులు చెప్పడంతో బెంగళూరు ప్రజలు షాక్ అయ్యారు.

ప్రముఖ ఐసీఐసీఐ బ్యాంకులో పని చేస్తున్న సౌమ్యా (పేరు మార్చడం జరిగింది) అనే యువతికి వస్తున్న జీతం ఆమె విలాసవంతమైన జీవితానికి సరిపోవడం లేదని పోలీసులు అన్నారు. ఎలాగైనా విలాసవంతమైన జీవితాన్ని గడపాలని భావించిన సౌమ్యా డబ్బు సులభంగా సంపాధించడానికి పక్కదారి పట్టింది. దేశంలోనే అత్యధికంగా ఐటీ ఉద్యోగులు ఉన్న బెంగళూరు నగరంలో ల్యాప్‌టాప్‌లను దొంగిలించేందుకు కూడా ఆమె సిద్ధమైంది.
చాకచక్యంగా ల్యాప్ టాప్ లు చోరీలు చేస్తున్న కిలాడీ లేడీ సౌమ్యాను బెంగళూరులోని హెచ్ ఏఎల్ పోలీసులు అరెస్ట్ చేశారు. సౌమ్యాను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆమెను విచారణ చేశారు. సౌమ్యా బెంగళూరులోని పలు హోటళ్లు, పీజీలను టార్గెట్ చేసిందని పోలీసులు తెలిపారు. హోటల్, పీజీలల్లో బస చేసిన వాళ్లు టిఫిన్, భోజనానికి వెళ్తుండగా ల్యాప్ టాప్ దొంగిలిస్తున్న సౌమ్యా అక్కడి నుంచి చాకచక్యంగా తప్పించుకుని పారిపోతున్నదని పోలీసులు అన్నారు.

సౌమ్యాను అదుపులోకి తీసుకుని విచారణ చెయ్యగా దిమ్మతిరిగిపోయే సమాచారం బయటకు వచ్చింది. నిందితురాలు సౌమ్యా ఐసీఐసీఐ బ్యాంకులో పనిచేసేదని, తరువాత ఉద్యోగంమానేసిందని వెలుగు చూసింది. అయితే ఉద్యోగం వదిలేసిన సౌమ్యా ఫుల్ టైమ్ దొంగతనాలు చేయడం ప్రారంభించిందని పోలీసులు అన్నారు. బెంగళూరు సిటీలోని కోరమంగళ, ఇందిరానగర్, హెచ్‌ఏఎల్ పోలీస్ స్టేషన్ పరిధిలో సౌమ్యా ల్యాప్‌టాప్ దొంగిలించిందని పోలీసులు అన్నారు.
సౌమ్యాను అరెస్టు చేసిన పోలీసులు ఆమె నుంచి రూ.10 లక్షలు విలువైన 24 ల్యాప్‌టాప్‌లు, నగదు, విలువైన వస్తులు స్వాధీనం చేసుకున్నామని, కేసు విచారణలో ఉందని బెంగళూరులోని హెచ్ ఏఎల్ పోలీసు అధికారులు తెలిపారు. మంచి ఉద్యోగం చేస్తున్న యువతి విలాసవంతమైన జీవితానికి అలవాటు పడి బెంగళూరులో ఖర్చులు తట్టుకోలేక దొంగగా మారిందని తెలుసుకున్న ప్రజలు షాక్ అయ్యారు.












Click it and Unblock the Notifications