అమ్మాయిని దారుణంగా హత్య చేశాడు. ఇన్ని రోజుల తర్వాత అదే అమ్మాయి ఇంటి ముందు ?

కర్ణాటక రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపిన కొడగులోని సోమవార పేటలో ఎస్‌ఎస్‌ఎల్‌సీ విద్యార్థిని హత్య కేసులో ఇప్పుడు మరో ట్విస్ట్‌ వచ్చింది. ముట్లు గ్రామంలో 16 ఏళ్ల పదవ తరగతి విద్యార్థినిని అతి కిరాతకంగా నరికి చంపి, ఆపై కత్తితో ఆమె శరీరాన్ని ముక్కలు చేసిన నిందితుడు ఇప్పుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అమ్మాయిని అతి కిరాతకంగా హత్య చేసిన నిందితుడు ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది.

సోమవారపేటలోని హమ్మియాల గ్రామంలో ఓంకారప్ప అలియాస్ ప్రకాష్ (32) అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు తెలిపారు. ప్రకాష్ మృతదేహం హత్యకు గురైన అమ్మాయి ఇంటి సమీపంలో వేలాడుతూ కనిపించింది.కొడగు జిల్లా సోమవారపేట తాలూకా ముట్లు గ్రామంలో 15 ఏళ్ల బాలికను నరికి చంపిన ప్రకాష్ అక్కడి నుంచి పరారయ్యాడు. హత్యకు గురైన అమ్మాయి 10వ తరగతి చదువుతోంది. పరీక్ష ఫలితాలు వచ్చిన తరువాత పాసైన ఆనందంలో ఆరోజు అమ్మాయితో ఆమె కుటుంబ సభ్యులు సంతోషంగా గడిపారు.

A youth who brutally murdered a class 10 girl committed suicide by hanging himself

10వ తరగతి పరీక్ష ఫలితాలు వచ్చిన మరుసటి రోజే ప్రకాష్ ఆ ఆ అమ్మాయిని అతి కిరాతకంగా హత్య చేశాడు. నిందితుడు ప్రకాష్ కు, హత్యకు గురైన అమ్మాయికి వివాహ నిశ్చితార్థం జరిగింది. అయితే మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు బాల్య వివాహాలు చేయవద్దని ఆ అమ్మాయి తల్లిదండ్రులను ఒప్పించారు. తరువాత తన పెళ్లి నిలిచిపోయిందని ప్రకాష్ అమ్మాయి కుటుంబ సభ్యుల మీద రగిలిపోయాడని తెలిసింది.

నిందితుడు ప్రకాష్ సాయంత్రం ఇంట్లోకి ప్రవేశించి కుటుంబ సభ్యులతో గొడవపడ్డాడు. తరువాత ఆ బాలిక తల్లిదండ్రులపై దాడి చేసి అనంతరం తల్లిదండ్రుల ముందే బాలికను అపహరించినట్లు సమాచారం.నిందితుడు ప్రకాష్ బాలికను అటవీ ప్రాంతంలోకి ఈడ్చుకెళ్లి ఆమె మెడపై కత్తితో పొడిచి దారుణంగా హత్య చేసి శవాన్ని ముక్కలు చెయ్యడానికి ప్రయత్నించాడు. బాలిక మృతదేహం మాత్రమే లభ్యం కాగా, మిగిలిన అవయవాల కోసం గాలించి మరుసటి రోజు వాటిని స్వాధీనం చేసుకున్నారు.

A youth who brutally murdered a class 10 girl committed suicide by hanging himself

ఇటీవల సోదరికి ఫోన్ చేసిన ఆ అమ్మాయి తాను ప్రకాష్ ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని చెప్పిందని తెలిసింది. అయితే ప్రకాష్ మాత్రం తాను అమ్మాయిని ప్రేమిస్తున్నానని, ఆమెనే పెళ్లి చేసుకుంటానని అమ్మాయి కుటుంబ సభ్యుల మీద ఒత్తిడి తీసుకు వచ్చాడని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. మొదట తనకు నిశ్చితార్థం చేస్తే తాను బెంగళూరు వెళ్లి మంచి ఉద్యోగంలో చేరి తరువాత పెళ్లి చేసుకుంటానని ప్రకాష్ అమ్మాయి కుటుంబ సభ్యుల మీద ఒత్తిడి తీసుకువచ్చాడని పోలీసుల విచారణలో వెలుగు చూసింది.

అమ్మాయికి ఇష్టం లేకపోయినా కుటుంబ సభ్యులు బలవంతంగా ప్రకాష్ తో ఆ అమ్మాయి పెళ్లి నిశ్చితార్థం జరిపించారని తెలిసింది అధికారులు పెళ్లిని అడ్డుకున్న తరువాత ప్రకాష్ ఆమె కుటుంబ సభ్యుల మీద రగిలిపోయాడని తెలిసింది. 10వ తరగతి పాస్ అయిన అమ్మాయి కుటుంబ సభ్యులు అదే రోజు గ్రామంలో పార్టీ పెట్టుకున్నారని, అదే రోజు సాయంత్రం ప్రకాష్ ఆ అమ్మాయిని బయటకు పిలుచుకుని వెళ్లి అతి దారుణంగా హత్య చేశాడని పోలీసు అధికారులు తెలిపారు. అమ్మాయిని హత్య చేసిన ప్రకాష్ పరారైనాడని, సోమవారం రాత్రి అమ్మాయి ఇంటి సమీపంలోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని సోమవారపేట పోలీసు అధికారులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+