ఆధార్‌తో 9 బిలియన్ కోట్లు ఆదా: నందన్ నీలేకని

Posted By:
Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: భారత ప్రభుత్వం ఆధార్‌కార్డును ప్రవేశపెట్టడంతో సుమారు 9 బిలియన్ కోట్లు ఆదా అయ్యాయని , ఆధార్ రూపకర్త నందన్ నీలేకని అభిప్రాయపడ్డారు. లబ్ధిదారుల జాబితాల్లో అక్రమాలకు చెక్‌ పెట్టడం ద్వారా ఆధార్‌ మూలంగా దాదాపు రూ 50,000 కోట్లు దుర్వినియోగం కాకుండా అడ్డుకోగలిగామని అన్నారు.

గత యూపీఏ హయాంలో చేపట్టిన ఈ పథకాన్ని ప్రధాని మోదీ, ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీల నేతృత్వంలోని ప్రస్తుత ప్రభుత్వం సమధికోత్సాహంతో ప్రోత్సహిస్తోందని ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌ నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌ కూడా అయిన నిలేకని పేర్కొన్నారు.

Aadhaar helped Indian govt check fraud, save $9 bn: Nilekani

ప్రపంచ బ్యాంక్‌ ఆధ్వర్యంలో డిజిటల్‌ ఎకానమీ ఫర్‌ డెవలప్‌మెంట్‌ అనే అంశంపై జరిగిన చర్చలో పాల్గొంటూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.మెరుగైన డిజిటల్‌ మౌలిక వసతుల నిర్మాణంతో శీఘ్రగతిన ముందుకెళ్లడం అభివృద్ధి చెందుతున్న దేశాలకు మంచి అవకాశమని చెప్పారు.

ఆధార్‌ను ఇప్పటివరకూ వంద కోట్ల మందిపైగా నమోదు చేసుకున్నారని తెలిపారు. లబ్ధిదారులు, ఉద్యోగుల జాబితా నుంచి నకిలీలు, డూప్లికేట్‌లను గుర్తించి వారిని తొలగించడంతో ప్రభుత్వ ఖజానాకూ పెద్ద ఎత్తున నిధులు ఆదా అయ్యాయని అన్నారు. సుమారు 9 బిలియన్ కోట్లు ఇండియా ప్రభుత్వానికి ఆదా అయ్యాయని నీలేకని అభిప్రాయపడ్డారు.

.ఆధార్‌ కారణంగా తాము 50 కోట్ల మంది ఐడీలను వారి బ్యాంక్‌ ఖాతాలకు జోడించామని చెప్పారు నీలేకని.ప్రపంచంలోనే అతిపెద్ద నగదు బదిలీ వ్యవస్థకు బాటలు పరిచామని చెప్పారు. ఆధార్‌తో మరెన్నో అద్భుతాలను ఆవిష్కరించనున్నామని నిలేకని తెలిపారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The Indian government's Aadhaar card scheme, which has enrolled more than 1 billion people, has helped the exchequer save about $9 billion by eliminating fraud in beneficiary lists, its architect Nandan Nilekani has said here.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి