ఢిల్లీ రేప్: చలించిపోయానన్న అమీర్ ఖాన్
హైదరాబాద్: ఢిల్లీలో యువతి పైన క్యాబ్ డ్రైవర్ అత్యాచారం దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన విషయం తెలిసిందే. దీని పైన బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ మంగళవారం స్పందించారు. లైంగిక వేధింపుల కేసుల విచారణను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. ఇలా చేస్తే మహిళల పైన వేధింపులు తగ్గుతాయని అభిప్రాయపడ్డారు.
ఢిల్లీలో ఘోరం జరిగిందని, ఇది చాలా దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. ఇలాంటి సంఘటనలు చదివినప్పుడు తన గుండె బరువెక్కుతుందన్నారు. ఇది చాలా దారుణమన్నారు. ఇలాంటి కేసులను త్వరితగతిన పరిష్కరించాలని అభిప్రాయపడ్డారు.

మహిళలు దేశ రాజధాని ఢిల్లీలో కన్నా ముంబైలోనే సురక్షితంగా ఉంటారని సోనమ్ కపూర్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఇటీవల ఢిల్లీలో క్యాబ్ రేప్ ఘటనపై బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ తీవ్రంగా స్పందించారు. ఈ రేప్ సంఘటన కేవలం ఢిల్లీ సిటీకి మాత్రమే కాదు... మొత్తం దేశానికే సిగ్గు చేటన్నారు. క్యాబ్ బుక్ చేసుకునే ముందు సేఫ్టీ గురించి ముందుగా ఆలోచించాలని అక్షయ్ కుమార్ ట్వీట్ చేశారు.
ఉబర్ క్యాబర్ సర్వీస్‌కు చెందిన క్యాబ్ డ్రైవర్ శుక్రవారం రాత్రి డిన్నర్ పార్టీ నుంచి తిరిగి వస్తున్న మహిళపై అత్యాచారం జరిపిన విషయం తెలిసిందే. ఇది అందరినీ కదిలించింది. లోకసభ, రాజ్యసభలలో మంత్రులు దీని పైన ప్రకటన చేశారు.
ఈ రేప్ ఘటన దక్షిణ ఢిల్లీలోని వసంత్ విహార్ నుంచి ఉత్తర ఢిల్లీలోని ఇందర్‌లోక్‌లో గల తన ఇంటికి తిరిగి వెళ్తుండగా రాత్రి జరిగింది. గుర్గావ్‌కు చెందిన గ్లోబల్ టాక్స్ అండ్ అడ్వయిజరీ సర్వీస్ కన్సల్టెంట్స్‌లో పనిచేస్తోంది. మొబైల్ ఆప్ ద్వారా ఆమె ఇంటికి తిరిగి వెళ్లడానికి స్విఫ్ట్ డిజైర్‌ను బుక్ చేసుకుంది. ఆ స్విఫ్ట్ కారులోనే దారుణం చోటు చేసుకుంది.












Click it and Unblock the Notifications