యూపీలో ఆప్‌కు అభ్యర్థి షాక్: ఎస్పీలో చేరిక, ఎస్పీ అభ్యర్థికి మద్దతు
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీకి తొలి విడత పోలింగ్ జరుగుతుంది. ఓటింగ్‌కు ఒకరోజు ముందు అనూహ్య పరిణామం జరిగింది. ఆమ్ ఆద్మీ పార్టీకి అభ్యర్థి ఒకరు షాక్ ఇచ్చారు. అతను పార్టీ మారుతున్నట్టు ప్రకటించి దుమారం రేపారు. చాతర్వల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆప్ యవర్ రోషన్‌కు టికెట్ ఇచ్చింది. కానీ ఆయన పార్టీ మారుతున్నట్టు ప్రకటన చేసి.. షాక్ ఇచ్చారు.
అంతేకాదు ఎస్పీ అభ్యర్థి పంకజ్ మాలిక్‌కు మద్దతు ఇస్తున్నట్టు ప్రకటన చేశారు. ఇదీ కీలక పరిణామంగా మారింది. తమ పార్టీకి రాజీనామా చేసి.. ఎస్పీలో చేరారు. అంతకుముందు ఎస్పీ అభ్యర్థి ఆఫీసులో రోషన్ ఉన్నట్టు ఓ వీడియో కనిపించింది. అదీ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. కీలక పరిణామంతో ఆప్ విస్తుపోయింది. వెంటనే రోషన్‌ను పార్టీ నుంచి బహిష్కరించింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని పేర్కొంది.

యూపీ తొలి విడతలో తొలి విడత బరిలో 623 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 2.27 కోట్ల మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. దోబ్ ప్రాంతంలో బీజేపీకి మంచి పట్టు ఉంది. 2017లో 58 సీట్లలో 53 చోట్ల విజయం సాధించింది. ఎస్పీ, బీఎస్పీ రెండు సీట్లను గెలుచుకున్నాయి. 20 నియోజకవర్గాల్లో మైనార్టీ, బీసీలు ప్రభావం చూపించాయి. ఆగ్రా, అలీఘడ్‌లో గల 16 సీట్లలో జాట్లు ప్రభావం చూపనున్నారు. 2012లో మాత్కం ఎస్పీ ఆర్ఎల్డీ 19 సీట్లు గెలుచుకుని తమ హవాను చాటింది.
Recommended Video
తొలివిడతలో మొత్తం 11 జిల్లాల్లో గల 58 నియోజకవర్గాల ఓటింగ్ జరగనుంది. షామ్లీ, ముజప్ఫర్ నగర్, మీరఠ్, బాగ్‌పట్, ఘజియాబాద్, హాపుర్, గౌతమ్ బుద్ధ నగర్, బులంద్‌షహర్, అలీగఢ్, మథుర, ఆగ్రా జిల్లాల్లో తొలి విడత అసెంబ్లీ ఎన్నిక జరుగుతుంది.












Click it and Unblock the Notifications