చండీఘడ్ మున్సిపోల్స్ లో కాంగ్రెస్, బీజేపీలకు ఆప్ షాక్- అసెంబ్లీ ఎన్నిలకు ముందు బూస్ట్
పంజాబ్ లో రాజకీయ సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి. తాజాగా కాంగ్రెస్ లో అంతర్గత పోరు కారణంగా సీఎం అమరీందర్ సింగ్ ను మార్చి చరణ్ జీత్ సింగ్ చన్నీకి అవకాశం కల్పించినా అది ఆ పార్టీకి అంతగా మేలు చేయడం లేదని తెలుస్తోంది. ఇవాళ విడుదలైన చండీఘర్ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ ను వెనక్కి నెట్టి విపక్ష ఆప్ ముందంజ వేయడమే ఇందుకు నిదర్శనం.
చండీగఢ్ మునిసిపల్ ఎన్నికల ఫలితాలు అసెంబ్లీ ఎన్నికలకు ముందు పంజాబ్‌లో ప్రధాన ప్రతిపక్షమైన ఆమ్ ఆద్మీ పార్టీకి ఊపునిచ్చాయి. పంజాబ్ ముఖ్యమంత్రిని మార్చాలన్న కాంగ్రెస్ నిర్ణయం, జాట్ సిక్కు కెప్టెన్ అమరీందర్ సింగ్ స్థానంలో దళిత సిక్కు చరణ్ జిత్ సింగ్ చన్నీని నియమించడం, రాష్ట్రంలో ఎన్నికలకు ముందు కాంగ్రెస్ కు అశనిపాతంలా మారేలా ఉంది.

చండీగఢ్ మున్సిపల్ కార్పొరేషన్‌లోని 35 స్థానాల్లో ఇవాళ మధ్యాహ్నానికి ఫలితాలు వెలువడగా, ఆప్ 14 స్థానాలను గెలుచుకుంది. భారతీయ జనతా పార్టీ (బీజేపీ) 12 సీట్లతో రెండో స్థానంలో నిలిచింది. ఎనిమిది స్థానాలతో కాంగ్రెస్ మూడో స్థానంలో నిలవగా, శిరోమణి అకాలీదళ్ (ఎస్‌ఎడి) ఒకటి గెలుచుకుంది. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల రేసులో ఈ ఫలితాలు ఆప్‌ని ముందంజలో ఉంచాయి. చండీగఢ్ మునిసిపల్ ఎన్నికల ఫలితాలను ఆప్ నాయకుడు రాఘవ్ చద్దా "ట్రైలర్"గా అభివర్ణించారు. చండీగఢ్ ఎన్నికలు ఒక ట్రైలర్; పంజాబ్ పూర్తి సినిమా అవుతుంది. చండీగఢ్ మూడ్ పంజాబ్ మూడ్. అందరూ ఆప్‌కి ఓటేస్తున్నారు. [ఢిల్లీ ముఖ్యమంత్రి] అరవింద్ కేజ్రీవాల్‌కు అవకాశం ఇవ్వాలని ప్రజలు నిర్ణయించుకున్నారని ఈ ఫలితాలు రుజువు చేస్తున్నాయని రాఘవ్ చద్దా అన్నారు.












Click it and Unblock the Notifications