పంజాబ్‌లో ఆప్ కొంపముంచినవి ఇవే!: కాంగ్రెస్‌కు అన్ని కలిసొచ్చాయి..
అదే సమయంలో తొలిసారి ఢిల్లీ బయట పోటీ చేసిన ఆప్ కు ఆ రాష్ట్రంలో క్షేత్రస్థాయిలో సంస్థాగత మద్దతు లేకపోవడం ఆ పార్టీకి భారీ డ్యామేజీని మిగిల్చినట్లుగా పరిశీలకులు చెబుతున్నారు.
చంఢీఘడ్: ఢిల్లీలో బీజేపీని చావుదెబ్బ కొట్టి అధికారంలోకి వచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీ అదే ఊపుతో దేశంలోని పలు రాష్ట్రాల్లో పాగా వేయాలని భావించింది. 2014 ఎన్నికల్లో పంజాబ్ లో నాలుగు లోక్ సభ స్థానాలు ఆప్ కైవసం కావడంతో.. ఆ రాష్ట్ర ప్రజలు పార్టీ పట్ల సానుకూల వైఖరితోనే ఉన్నారని అధినేత కేజ్రీవాల్ భావించారు.
ఈ నేపథ్యంలో తాజా ఎన్నికల్లో కచ్చితంగా గెలుస్తామన్న ధీమాతో కేజ్రీవాల్ పంజాబ్ ఎన్నికల బరిలో దిగారు. కాంగ్రెస్ పై విమర్శనాస్త్రాలు సంధిస్తూనే శిరోమణి అకాలీదళ్-బీజేపీకి చెక్ పెట్టే ప్రయత్నం చేశారు. సాధారణంగానే శిరోమణి అకాలీదళ్ పార్టీపై ఉన్న వ్యతిరేకత ఆ పార్టీని చావుదెబ్బ కొట్టగా.. నవజ్యోత్ సింగ్ సిద్దూ లాంటి నేతలు బీజేపీని వీడి కాంగ్రెస్ లోకి రావడం ఆ పార్టీకి కలిసొచ్చింది.

కేజ్రీవాల్ కు దెబ్బ అక్కడే:
అదే సమయంలో తొలిసారి ఢిల్లీ బయట పోటీ చేసిన ఆప్ కు ఆ రాష్ట్రంలో క్షేత్రస్థాయిలో సంస్థాగత మద్దతు లేకపోవడం ఆ పార్టీకి భారీ డ్యామేజీని మిగిల్చినట్లుగా పరిశీలకులు చెబుతున్నారు. 2014 లోక్ సభ ఎన్నికల్లో ఆప్ 25శాతం ఓట్లను కైవసం చేసుకున్నప్పటికీ.. ఆ ఓటు బ్యాంకును, క్షేత్రస్థాయిలో పార్టీ కార్యకర్తలను పెంచుకోవడంలో కేజ్రీవాల్ విఫలమైనట్లుగా తాజా ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి.

పంజాబ్ గడ్డపై బయటి పార్టీ ముద్ర:
ఆప్ కు ప్రతికూలంగా నిలిచిన మరో అంశం బయటి పార్టీ అన్న ముద్ర. కేజ్రీవాల్ పంజాబ్-హర్యానా రాష్ట్రం విడిపోకముందే పుట్టారని, కాబట్టి ఆయన పంజాబ్ కు చెందినవారేనని ఆప్ ప్రచారం చేసుకున్నప్పటికీ.. దాని ఎఫెక్ట్ ఓటర్ల మీద అంతగా ప్రభావితం చూపినట్లు కనిపించడం లేదు.
కేజ్రీవాల్ ను బయటి పార్టీ నేతగా చూపించడంలో కాంగ్రెస్ చాలావరకు విజయం సాధించింది.

నీళ్లు తరలించుకుపోతారన్న ఆరోపణ:
పంజాబ్ గడ్డపై కేజ్రీవాల్ పార్టీ పాగా వేస్తే.. సట్లెజ్ నది జలాలను ఢిల్లీకి తరలించుకుపోతారని ప్రత్యర్థి పార్టీలు ఆయనపై విమర్శలు చేస్తూ వచ్చింది. దాంతో పాటు పంజాబీలకు చెక్ పెట్టేందుకు స్థానికేతరులను ఎక్కువ సంఖ్యలో నిలబెట్టారన్న ఆరోపణలు చేశాయి.
కాంగ్రెస్ మెజారిటీకి ఆప్ గండి కొడుతుందని ఆ పార్టీ భావించడంతో తొలినుంచి ఆప్ ను ఎదుర్కోవడం పైనే కాంగ్రెస్ ఎక్కువగా ఫోకస్ చేస్తూ వస్తోంది. అదే సమయంలో ప్రకాశ్ సింగ్ బాదల్ ప్రభుత్వంపై వ్యతిరేకతను తమకు అనుకూలంగా మార్చుకోవడంలో కాంగ్రెస్ విజయవంతమైందని చెప్పాలి.

పంజాబ్ ఫలితం ఇలా:
కౌంటింగ్ ప్రారంభ దశలో ఆప్ కాంగ్రెస్ కన్నా ముందంజలో ఉన్నట్లు కనిపించినా.. ఆ ప్రభావం కొంతమేరకే పరిమితమైంది. ఆ తర్వాతి దశల్లో కాంగ్రెస్ అన్నింటా ఆప్ ను వెనక్కి నెట్టేస్తూ స్పష్టమైన మెజారిటీని కైవసం చేసుకుంది. కాంగ్రెస్ -64 స్థానాల్లో పాగా వేసి ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన సంపూర్ణ మెజారిటీ సాధించింది.
మరోవైపు ఆప్-24 సీట్లతో సరిపెట్టుకోగా, శిరోమణి అకాలీదళ్-30స్థానాలకు పరిమితమైంది. బీజేపీ అసలు ఖాతానే తెరవలేదు.
-
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత












Click it and Unblock the Notifications