వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మధ్యప్రదేశ్‌లో 116 మంది బిజెపి ఎమ్మెల్యేలపై చర్యలకు ఆప్ డిమాండ్

By Narsimha
|
Google Oneindia TeluguNews

భోపాల్: మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని 116 మంది బిజెపి ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని ఆప్ మధ్యప్రదేశ్ రాష్ట్ర శాఖ న్యూఢిల్లీలోని కేంద్ర ఎన్నికల సంఘానికి సోమవారం నాడు వినతిపత్రం సమర్పించింది. ఢిల్లీలోని 20 మంది ఆప్ ఎమ్మెల్యేలపై ఈసీ అనర్హత వేటు వేసిన మరునాడే ఆప్ మధ్యప్రదేశ్ శాఖ ఈసీకి వినతిపత్రం సమర్పించడం గమనార్హం.

ఆప్ మధ్యప్రదేశ్ శాఖకు చెందిన నేతలు మధ్యప్రదేశ్ ఈసీ కార్యాలయం ఎదుట ఆందోళన కూడ నిర్వహించారు. రాజ్యాంగంలోని ప్రజా ప్రతినిథ్య చట్టం 191 (1), 192 ఆర్టికల్స్ ప్రకారంగా బిజెపికి చెందిన 116 మంది ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని ఆప్ డిమాండ్ చేసింది.

AAP Seeks Disqualification Of 116 BJP Lawmakers In Madhya Pradesh

న్యూఢిల్లీలోని ఆప్ ఎమ్మెల్యేలపై ఏ రకంగా ఈసీ చర్యలు తీసుకొందో మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన 116 మంది బిజెపి ఎమ్మెల్యేలపై కూడ ఈసీ చర్యలు తీసుకొంటుందనే ఆశాభావాన్ని ఆప్ మధ్యప్రదేశ్ రాష్ట్ర శాఖ కన్వీనర్ ఆలోక్ అగర్వాల్ వ్యక్తం చేశారు.

ఒకవేళ ఈసీ ఈ 116 మంది బిజెపి ఎమ్మెల్యేలపై చర్య తీసుకొంటే మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని బిజెపి ప్రభుత్వం మైనారిటీలో పడిపోతోంది.

మధ్యప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీలోని 230 సీట్లలో బిజెపికి 165 మంది సభ్యులున్నారు. కాంగ్రెస్ పార్టీకి 55 మంది ఉన్నారు. ఈసీ ఈ బిజెపి ఎమ్మెల్యేలపై చర్య తీసుకొంటే బిజెపి ప్రభుత్వం మైనారిటీలో పడిసోతోంది.

ఈ విషయమై తాము 2016 జూలై 4వ, తేదినే ఈసీకి ఫిర్యాదు చేసినట్టు ఆలోక్ అగర్వాల్ గుర్తు చేశారు. ఏడాదిన్నర క్రితమే ఈ విషయమై తాము ఫిర్యాదు చేసినా ఎన్నికల సంఘం దీన్ని పట్టించుకోలేదని ఆలోక్ అగర్వాల్ ఆరోపించారు. నిబంధనలను అధికారులు తుంగలో తొక్కారని అలోక్ అగర్వాల్ అన్నారు.

ఈ ఆరోపణలను బిజెపి తీవ్రంగా ఖండించింది. ఆప్ నిరాశా, నిస్పృహలతోనే తమపై తప్పుడు ఆరోపణలు చేస్తోందని బిజెపి భిప్రాయపడింది.ఈ ఆరోపణలను పెద్దగా పట్టించుకోవసరం లేదని బిజెపి అధికార ప్రతినిధి దీపక్ అభిప్రాయపడ్డారు.

English summary
The AAP submitted a memorandum to the EC in Bhopal with its demand, a day after its 20 MLAs in New Delhi were disqualified by President Ram Nath Kovind on the recommendation of the EC for holding offices of profit.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X