సినిమా డైరెక్టర్‌గా, మేథ్స్ టీచర్‌లా: ఆరుషి హత్య కేసులో సిబిఐ జడ్జిపై హైకోర్టు సంచలన వ్యాఖ్యలు

Posted By:
Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: ఒక ఆలోచన ఆధారంగా కథ అల్లుకొని, దానికి తగ్గట్లు సీన్లు రాసుకొని సినిమాను ఓ కొలిక్కి తెస్తారు దర్శకులు. సంచలనం రేపిన ఆరుషి - హేమరాజ్ హత్య కేసులోను సిబిఐ విచారణ జడ్జి సరిగ్గా సినిమా దర్శకుడిలా వ్యవహరించారని అలహాబాద్ ధర్మాసనం సంచలన వ్యాఖ్యలు చేసింది.

ఆరుషి హత్య కేసు: తల్లిదండ్రులు నిర్దోషులే, అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు

ఆరుషి హత్య కేసులో నిందితులైన ఆమె తల్లిదండ్రులు నిర్దోషులని గురువారం అలహాబాద్‌ హైకోర్టు తీర్పు వెలువరించింది.

Aarushi murder: Trial judge assumed fictional animation of the incident

అయితే ఆరుషి కేసులో ఆమె తల్లిదండ్రులను సీబీఐ కోర్టులో దోషులుగా తీర్పు వెలువరించిన సమయంలో సీబీఐ కోర్టు న్యాయమూర్తి ఎస్‌లాల్‌ ఓ గణిత మాస్టారుగా, దర్శకుడిగా వ్యవహరించారని హైకోర్టు తీర్పులో పేర్కొంది.

అప్పట్లో ఆరుషి తల్లిదండ్రులు నుపూర్‌, రాజేశ్‌ తల్వార్‌లను దోషులుగాపేర్కొంటూ న్యాయమూర్తి ఓ గణిత మాస్టారుగా వ్యవహరించారని, ఓ చిత్ర దర్శకుడిగా తనకి తానే ఏవేవో ఊహించుకుని నిజనిజాలను తెలుసుకునేందుకు ప్రయత్నించలేదని, అసలు విషయం కాకుండా తీర్పులో కట్టుకథలు వినిపించారని పేర్కొంది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The Allahabad High Court on Thursday acquitted Dr Rajesh and Nupur Talwar in the Aarushi-Hemraj murder case. The Division Bench comprising Justices Bala Krishna Narayana and Arvind Kumar Mishra had very strong words for the trial court judge who had convicted the Talwars in the double murder case.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి