మాఘ నక్షత్రంలోకి కేతువు.. 32 రోజులు మిథునం, కన్య, మీన రాశులవారు చేయాల్సింది ఒకటే

వేద జ్యోతిష్య శాస్త్రంలో కేతువును 'ఛాయాగ్రహం'గా, 'మోక్ష కారకుడు'గా పరిగణిస్తారు. రాహు, కేతువులు ఎప్పుడూ వక్ర మార్గంలోనే అంటే వెనక్కి ప్రయాణిస్తుంటాయి. కేతువు తన నక్షత్రాన్ని మార్చిన ప్రతిసారీ.. మనుషుల జీవితాల్లో, ముఖ్యంగా వారి ఆర్థిక, వృత్తిపరమైన రంగాల్లో, మానసిక స్థితిలో పెను మార్పులు సంభవిస్తాయి. మే 29న కేతువు 'మాఘ' నక్షత్రం 3వ పాదంలోకి ప్రవేశించనున్నాడు. జూన్ 30 వరకు అక్కడే సంచారం చేస్తాడు. మాఘ నక్షత్రానికి బుధుడు అధిపతి. ఈ కారణంగా రాబోయే 32 రోజుల పాటు బుధ, కేతువుల సంయుక్త ప్రభావం అన్ని రాశులపై పడనుంది.దీనివల్ల అప్రమత్తంగా ఉండాల్సిన రాశుల వివరాలను తెలుసుకుందాం. వీరంతా గణపతి ఆరాధన చేయడం చాలా ముఖ్యం.

మిథున రాశి వారికి తీవ్ర మానసిక సంఘర్షణ

మాఘ నక్షత్రంలో కేతువు ప్రవేశం మిథున రాశి వారికి అంతగా కలిసిరాదు. బుధుడి ప్రభావం వల్ల ఈ సమయంలో మీ ఆలోచనా విధానంలో స్పష్టత లోపిస్తుంది.సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోలేక తీవ్ర గందరగోళానికి గురవుతారు. కార్యాలయంలో పైఅధికారులతో లేదా సహోద్యోగులతో అనవసర విభేదాలు వచ్చే సూచనలు ఉన్నాయి. నిగ్రహం కోల్పోవద్దు. కొత్తగా ఎలాంటి వ్యాపారాలు ప్రారంభించకపోవడం మంచిది. లాటరీలు, బెట్టింగులు, షేర్ మార్కెట్ వంటి రిస్క్‌తో కూడిన పనులకు దూరంగా ఉండాలి, లేకపోతే భారీ నష్టాలు తప్పవు. ధన నష్టం జరిగే అవకాశం ఉన్నందున ఖర్చుల విషయంలో జాగ్రత్త అవసరం.

Ketu Enters Magha Nakshatra For Next 32 days these signs gemini virgo and pisces must do this

కన్యా రాశి వారికి కష్టానికి తగ్గ ఫలితం దక్కదు

కన్యా రాశి వారికి ఈ కేతు నక్షత్ర సంచారం ప్రతికూల ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంది. జీవితంలో అకస్మాత్తుగా గందరగోళ పరిస్థితులు ఎదురవుతాయి. మీరు అనుకున్న అసలు లక్ష్యం నుంచి మీ దృష్టి పక్కకు మళ్లే ప్రమాదం ఉంది. ఎంత కష్టపడి పనిచేసినా దానికి తగిన గుర్తింపు లేదా ప్రశంసలు లభించకపోవచ్చు. ఇది మిమ్మల్ని నిరాశకు గురి చేస్తుంది. ఈ 32 రోజులు మీ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. చిన్నపాటి అనారోగ్య సమస్యలను కూడా నిర్లక్ష్యం చేయకుండా వైద్యుడిని సంప్రదించడం మంచిది.

మీన రాశి వారికి కుటుంబంలో కలహాలు, అపార్థాలు

మీన రాశిలో జన్మించిన వారికి ఈ సమయం కాస్త పరీక్షా కాలమనే చెప్పాలి. ముఖ్యంగా మాటతీరు మీకే సమస్యలు తెచ్చిపెట్టవచ్చు. మాట్లాడేటప్పుడు మాట తడబడటం లేదా ఆవేశపడటం వల్ల ఇతరులతో గొడవలు రావచ్చు. ముఖ్యంగా జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి, లేదంటే అపార్థాలు పెరిగి వైవాహిక జీవితంలో ప్రశాంతత కరువవుతుంది. ఊహించని విధంగా ఆకస్మిక ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి. దీనివల్ల ఆర్థిక బడ్జెట్ తలకిందులవుతుంది. ఇంట్లో చిన్న చిన్న విషయాలకే గొడవలు జరిగి కుటుంబ వాతావరణం చల్లబడే అవకాశం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+