"సైన్యాన్ని ఢిల్లీలో వాడేస్తుంటే.. బోర్డర్ లో చైనా..!"-మోడీపై దిప్కే ఫైర్..!
అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుల్లో చైనా దళాలు.. భారత బలగాలతో నిత్యం ఘర్ణణలకు దిగుతున్నాయంటూ ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ (ఐటీబీపీ) డైరెక్టర్ జనరల్ వెల్లడించిన నేపథ్యంలో కాక్రోచ్ జనతా పార్టీ ఘాటుగా స్పందించింది. ప్రధాని మోడీ జాతీయ భద్రతను పణంగా పెడుతున్నారంటూ కాక్రోచ్ పార్టీ ఛీఫ్ అభిజీత్ దిప్కే (Abhijeet Dipke) ఆరోపించారు. సరిహద్దుల్లో ఉండాల్సిన సైన్యాన్ని ఢిల్లీలో నిరసనకారులపై మోహరిస్తుంటే.. ఇలాంటి పరిస్ధితులే తలెత్తుతాయని దిప్కే విమర్శించారు.
ఇప్పుడు చైనాను ఎదుర్కోవడం కష్టమంటూ ఐటీబీపీ డీజీ చేసిన వ్యాఖ్యల వీడియోను అభిజీత్ దిప్కే షేర్ చేశారు. సాంప్రదాయ సైనిక సామర్థ్యంలో భారత్, చైనాల మధ్య ఉన్న అంతరంపై డీజీ ఐటీబీపీ స్పష్టమైన అంచనా వేసినట్లు ఉన్న ట్వీట్ లో ఈ వీడియో ఉంది. డ్రోన్ సామర్థ్యాన్ని అభివృద్ధి చేసుకోవడం మనకు ఉన్న ఒక అవకాశమని ఆయన ఉక్రెయిన్‌ను ఉదాహరణగా చూపారు. దీనిపై దిప్కే స్పందిస్తూ ట్వీట్ చేశారు.

అవును, ఎందుకంటే మన సరిహద్దులను కాపాడాల్సిన బలగాలను, పౌరులు నిరసనలు చేయకుండా ఆపడానికి మోహరిస్తున్నారని దిప్కే ఆరోపణలు గుప్పించారు. ప్రధాని మోదీ తన సొంత దేశస్థులపై భద్రతా బలగాలను ఉపయోగించి జాతీయ భద్రతను ప్రమాదంలో పడేస్తున్నారన్నారు. శాంతియుత నిరసనలను అణచివేసేందుకు ఢిల్లీని ఒక దుర్గంగా మార్చడం కాదు, మన సరిహద్దులను సురక్షితం చేసుకోవడమే మన ప్రాధాన్యతగా ఉండాలని అభిజిత్ దిప్కే ప్రధాని మోడీకి సూచించారు. చైనా సరిహద్దుల్లో భారత బలగాలపై ప్రత్యర్థి దళాల దాడుల వ్యవహారంపై ఇప్పటివరకూ స్పందించకుండా మౌనంగా ఉన్న కేంద్రం తీరుపై ఇప్పటికే విపక్షాలు మండిపడుతున్నాయి. ఐటీబీపీ డీజీ చేసిన వ్యాఖ్యల తర్వాత విపక్షాలు వరుసగా కేంద్రాన్ని టార్గెట్ చేయడం ప్రారంభించాయి. అయినా కేంద్రం దీనిపై నోరు మెదపడం లేదు. దీంతో దిప్కే ఈ ట్వీట్ చేశారు.














Click it and Unblock the Notifications
