మణిపూర్ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా మాజీ సీఎం కుమార్తె అభిలాష

Subscribe to Oneindia Telugu

ఇంఫాల్: మణిపూర్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అభిలాష కుమారి శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. మణిపూర్ గవర్నర్ నజ్మా హెప్తుల్లా ఆమె చేత ప్రమాణ స్వీకారం చేయించారు.

గుజరాత్ హైకోర్టు నుంచి జస్టిస్ కుమారికి మంగళవారం పదోన్నతి లభించింది. కాగా, జస్టిస్ అభిలాష కుమారి హిమాచల్‌ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వీరభద్రసింగ్ కుమార్తె. ఢిల్లీ యూనివర్సిటీ పూర్వ విద్యార్థి అయిన అభిలాష కుమారి.. హిమాచల్ ప్రదేశ్ యూనివర్సిటీలో న్యాయ విద్య పూర్తి చేశారు.

Abhilasha Kumari sworn-in as Manipur HC Chief Justice

1984లో న్యాయవాద వృత్తిని స్వీకరించిన అభిలాష.. హిమాచల్ ప్రదేశ్ హైకోర్టులో ప్రాక్టీసు చేశారు. అనంతరం హిమాచల్‌ప్రదేశ్ అడిషనల్ అడ్వొకేట్ జనరల్‌‌గా కూడా చేశారు. ఆ తర్వాత 2005లో గుజరాత్ హైకోర్టు జడ్జీగా పదోన్నతి పొందారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Justice Abhilasha Kumari on Friday was sworn in as the Chief Justice of Manipur High Court.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి