అభినందన్ మీసాలను జాతీయ చిహ్నాలుగా ప్రకటించాలని డిమాండ్...కాంగ్రెస్ పార్లమెంటరీ నేత
ఇప్పటి వరకు విద్యార్థులు పుస్తకాల్లో జాతీయ జెండా, జాతీయ గీతం జాతీయ జంతువు, జాతీయ పక్షి, అని జాతీయ చిహ్నాలను విద్యార్థులు చదువుకున్నారు...కాని రానున్న రోజుల్లో జాతీయ చిహ్నాల జాబితాలో మీసాలు కూడ చేరనున్నాయనే భావించాలి...నేడు పార్లమెంట్‌లో జాతీయా నేత, కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ నాయకుడు, భారత దేశానికి జాతీయ మీసాలు కూడ ఉండాలనే చర్చను లేవనెత్తాడు...అదికూడ ఇటివల పుల్వామా దాడి తర్వాత పాకిస్థాన్‌కు పట్టుబడి విడుదలైన వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్ మీసాలను జాతీయ మీసాలుగా ప్రకటించాలని ఆయన పార్లమెంట్‌లో డిమాండ్ చేశాడు.

మీసాల అభిమానం...
వింగ్ కమాండర్ అభినందన్ భారత దేశంతోపాటు ప్రపంచదేశాలకు సుపరిచితుడు..బాలాకోట్ దాడి తర్వాత పాకిస్థాన్‌పై సర్జికల్ స్ట్ర్రైక్ నిర్వహించిన అనంతరం పాకిస్థాన్ పట్టుబడి భారత ప్రభుత్వం నిర్వహించిన ద్వైపాక్షిక చర్యల వల్ల తిరిగి ఇండియాకు అప్పగించిన విషయం తెలిసిందే...పుల్వామా దాడి తర్వాత భారత ప్రభుత్వం నిర్వహించిన బాలాకోట్ దాడి అనంతరం జరిగిని పరిమాణాల నేపథ్యంలో వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్ దేశ యువతతోపాటు సైన్యానికి ఆదర్శవంతగా నిలిచాడు. ముఖ్యంగా అభినందన్ సహసంతో పాటు ఆయన మిసాలు దేశ యువతను అమితంగా ఆకర్షించాయి..
Recommended Video


క్రికెట్ అభిమానులకు క్రేజ్‌గా మారిన అభినందన్ మీసాలు
దీంతో చాలమంది యువతతోపాటు పలువురు భారత దేశ పౌరులు అభినందన్ స్ట్రైల్లో మీసం కట్‌ను చేయించుకున్నారు. దీంతో ఆయన మీసాలకు ఉన్న క్రేజ్ ఒక్కసారిగా పెరిగింది..యువత తమ జాతీయ భావాన్ని తెలిపేందుకు అభినందన్ మీసపు కట్టును పెంచుకున్నారు. ఇక క్రికెట్ అభిమానుల్లో అయితే ఆ మీసాలకు మరింత క్రేజ్ పెరిగింది..స్టేడియంలో చాల మంది అభినందన్‌ను అనుకరిస్తూ మీసాలను పెంచుకున్న సంఘటనలు చూశాము..మరోవైపు పాకిస్థాన్ సైతం ఆయన మీసాలను గెలి చేస్తూ ఓ యాడ్‌ను కూడ సృష్టించింది..అయితే వివాస్పదమైనా...అభినందన్ మీసాలకున్న క్రేజ్‌ను ఆడ్‌లో చూపించారు.

అభింనందన్ మీసాలపై పార్లమెంట్‌లో చర్చ
ఇన్నాళ్లు అభినందన్ మీసాలపై యూత్‌లో క్రేజ్ ఉంటే ప్రస్థుతానికి ఆయన మీసాల వ్యవహారం పార్లమెంట్‌కు కూడ చేరింది. దేశ భద్రతా వ్యవహారాలపై తీసుకునే నిర్ణయాల్లో మోడీకి క్రెడిట్ వెళుతున్న నేపథ్యంలో ఆ అంశాలపై కాంగ్రెస్ పార్టీ ఫోకస్ పెట్టింది..గతంలో ఎన్నో సార్లు ఇలాంటీ సర్జికల్ స్ట్రైక్స్ జరిగిన మోడీ హాయంలో నిర్వహించిన సర్జికల్ స్ట్రైక్ దేశావ్యాప్త సంచలనం రేపింది. ఈనేపథ్యంలోనే బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ నేత ఆధీర్ రాజన్ చౌదరీ అభినందన్ మీసాలపై చర్చను లేవనెత్తాడు. దీంతో ఆయన మీసాలను జాతీయ చిహ్నాలుగా ప్రకటించాలని ఆయన కోరారు. దీంతోపాటు ఆయన శౌర్యానికి తగిన అవార్డు కూడ ప్రకటించాలని ఆయన పార్లమెంట్‌లో డిమాండ్ చేశారు.

మోడీ మంచి సేల్స్‌మెన్
ఈనేపథ్యంలోనే ప్రధాని నరేంద్రమోడీ జాతీయ భద్రతా విషయాల్లో ఆయన మంచి సేల్స్‌మెన్‌గా వ్వవహరించాడని ,తన ప్రొడక్ట్స్‌ను మార్కెట్‌లో మంచి సేల్ చేసుకున్నాడని అన్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ మాత్రం తమ ఉత్పత్తులను మార్కెట్‌లోకి సరిగా తీసుకెళ్లలేక పోయిందని అన్నారు. దీంతోపాటు కాంగ్రెస్ పార్టీ తీసుకువచ్చిన పథకాలనే బీజేపీ పేర్లు మార్చి ప్రజల్లోకి తీసుకెళుతుందని అన్నారు.












Click it and Unblock the Notifications