రాజస్థాన్ బీజేపీ ఎంఎల్ఏపై హత్యాయత్నం

జైపూర్: బీజేపీ శాసన సభ్యుడిపై హత్యాయత్నం జరిగిన సంఘటన రాజస్థాన్ లో జరిగింది. అయితే అదృష్టవశాత్తు ఆయన ప్రాణాలతో బయటపడ్డాడని రాజస్థాన్ పోలీసు అధికారులు తెలిపారు.

రాజస్థాన్ లోని దౌసా లోని మహ్వా శాసన సభ నియోజక వర్గానికి చెందిన శాసన సభ్యుడు ఓం ప్రకాష్ హుడ్లా ఇంట్లో పనుల్లో బిజిగా ఉన్నారు. ఆ సందర్బంలో ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు కిటికిలో నుండి ఆయన మీద కాల్పులు జరిపారు.

 Abortive attempt on the life of BJP MLA in Rajasthan

విషయం గుర్తించిన ఓం ప్రకాష్ హుడ్లా తప్పించుకున్నాడు. పలు రౌండ్ లు కాల్పులు జరిపారు. తుపాకి తూటాల నుండి తప్పించుకున్న ఓం ప్రకాష్ హుడ్లా వెంటనే ఇంటిలో అలారం మోగించారు. సెక్యూరిటి సిబ్బంది అలర్ట్ అయ్యారు.

చిక్కిపోతామని భయపడిన నిందితులు అక్కడి నుండి పరారైనారు. విషయం తెలుసుకున్న పోలీసు అధికారులు సంఘటనా స్థానికి చేరుకుని పరిశీలించారు. పాత కక్షల కారణంగా హత్యాయత్నం జరిగిందా, రాజకీయ కక్షలు ఉన్నాయా అని ఆరా తీస్తున్నామని అధికారులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+