వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'ఏబీపీ-సీఎస్‌డీఎస్' ఎగ్జిట్ పోల్: బీజేపీ అతిపెద్ద పార్టీ

ఉత్తరప్రదేశ్‌లో హంగ్ వస్తుందని 'ఏబీపీ - సీఎస్‌డీఎస్' ఎగ్జిట్ పోల్ సర్వే ఫలితాలు చెబుతున్నాయి. అతిపెద్ద పార్టీగా బీజేపీ అవతరిస్తుందని తెలిపింది.

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లో హంగ్ వస్తుందని 'ఏబీపీ - సీఎస్‌డీఎస్' ఎగ్జిట్ పోల్ సర్వే ఫలితాలు చెబుతున్నాయి. అతిపెద్ద పార్టీగా బీజేపీ అవతరిస్తుందని తెలిపింది.

రాష్ట్రాల వారిగా మేజిక్ ఫిగర్లు.. యూపీలో 202, పంజాబ్‌లో 59, మణిపూర్‌లో 31, గోవాలో 21, ఉత్తరాఖండ్‌లో 36.

'ఏబీపీ - సీఎస్‌డీఎస్' ఎగ్జిట్ పోల్ ప్రకారం యూపీలో బీజేపీకి 164 నుంచి 176 సీట్లు వస్తాయి. ఎస్పీ కాంగ్రెస్ పార్టీలకు 156 నుంచి 169 సీట్లు వస్తాయి. బీఎస్పీకి 60-72 సీట్లు వస్తాయి.

ABP CSDS predicts hung assembly in UP, BJP to bag maximum seats

ఈ సర్వే ప్రకారం ఏ పార్టీకి కూడా మేజిక్ ఫిగర్ (202) స్థానాలు రావు. ప్రస్తుతం అందరి దృష్టి ఉత్తర ప్రదేశ్ ఎన్నికల పైనే ఉంది. ఈ ఎన్నికలు 2019కి సెమీ ఫైనల్స్ వంటివి.

2014 లోకసభ ఎన్నికల్లో బీజేపీ 73 స్థానాలు గెలుపొందింది. నరేంద్ర మోడీ ప్రధాని కావడంలో ఈ రాష్ట్రం పాత్రనే అత్యధికం.

ఇదిలా ఉండగా యూపీలో ఏ పార్టీకీ మెజార్టీ రావడం లేదు. ఎన్నికల సమయంలో బీజేపీ - బీఎస్పీ అలయెన్స్ పైన చర్చ జరిగింది. కానీ మాయావతి తిప్పికొట్టారు. ఇప్పటికే బీఎస్పీ మద్దతు తీసుకునేందుకు అఖిలేష్ సిద్ధమని ప్రకటించారు.

English summary
The ABP-CSDS has predicted a hung assembly in Uttar Pradesh with the Bharatiya Janata Party emerging as the single largest party.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X