ఏబీపీ మూడ్ ఆఫ్ ది నేషన్-సర్వే: యూపీ, మహారాష్ట్ర, బీహార్ ఎవరు ఎన్ని సీట్లలో గెలుస్తారంటే?
న్యూఢిల్లీ: 2019 లోకసభ ఎన్నికల్లో ఉత్తర ప్రదేశ్‌లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే 31 లోకసభ స్థానాలు, కాంగ్రెస్ నేతృత్వంలోని గ్రాండ్ అలయెన్స్ 41 సీట్లు గెలుచుకుంటుందని ఏబీపీ దేశ్ కా మూడ్ సర్వేలో వెల్లడైంది. ఏబీపీ ఛానల్ దేశ్ కా మూడ్ పేరుతో సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో యూపీలో బీజేపీకి భారీ షాక్ తగలనుందని తేలింది.
వచ్చే ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్, ఎస్పీ, బీఎస్పీలు వేర్వేరుగా పోటీ చేస్తే బీజేపీ మళ్లీ డెబ్బై స్థానాల వరకు గెలుచుకుంటుందని ఈ సర్వేలో వెల్లడైంది. విపక్షాలు కలిస్తే మాత్రం షాక్ తగలనుందని తేలింది. వేర్వేరుగా పోటీ చేస్తే ఎన్డీయేకు 70 సీట్లు, యూపీఏకు 2, సమాజ్‌వాది పార్టీకి 4, మాయావతి నేతృత్వంలోని బీఎస్పీకి 4 సీట్లు రానున్నాయని సర్వేలో తేలింది. పార్టీలు కలిసి పోటీ చేస్తే మాత్రం బీజేపీకి 31, కాంగ్రెస్, ఎస్పీ, బీఎస్పీలకు 44 సీట్లు వస్తాయని తేలింది.

48 లోకసభ స్థానాలు ఉన్న మహారాష్ట్రలో పార్టీలు వేర్వేరుగా పోటీ చేస్తే... బీజేపీ 23 సీట్లు, కాంగ్రెస్ 14 సీట్లు, శివసేన 5 సీట్లు, శరద్ పవాల్ నేతృత్వంలోని ఎన్సీపీ 6 సీట్లు గెలుచుకుంటుందని సర్వేలో తేలింది. అలా కాకుండా శివసేన, బీజేపీలు కలిసి, కాంగ్రెస్, ఎన్సీపీలు కలిస్తే ఎన్డీయేకు 28 సీట్లు, యూపీఏకు 20 సీట్లు వస్తాయని తేలింది.
40 సీట్లు ఉన్న బీహార్‌లో ఎన్డీయే కూటమికి 36 సీట్లు, యూపీఏ కూటమికి 6 సీట్లు వస్తాయని సర్వేలో వెల్లడైంది. కాగా, ఏబీపీ దేశ్ కా మూడ్ పేరుతో వరుసగా సర్వేలు నిర్వహిస్తోంది.
-
ఇకపై రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications