పరారైన యూపీ కరోనా పేషెంట్ దొరికాడు .. కానీ కొత్త తలనొప్పి కూడా తెచ్చి పెట్టాడు .. అదేంటంటే !!
ఇటీవల యూపీలో లోక్‌నాయక్ జయప్రకాశ్ నారాయన్ ( ఎల్‌ఎన్‌జేపీ) ఆసుపత్రి నుంచి పారిపోయిన కరోనా బాధితుడు ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు . ఢిల్లీలోని నిజాముద్దీన్ మర్కజ్ కు వెళ్ళి రావటంతో అతడికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. యూపీ సర్కార్ అతనిని ప్రభుత్వాస్పత్రిలో చేర్చి ఐసోలేషన్ వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్న క్రమంలో అతను పారిపోయాడు . ఫైనల్ గా అతన్ని పట్టుకొచ్చి ఆస్పత్రిలో ఐసోలేషన్ వార్డులో ఉంచిన పోలీసులకు అతను ఎక్కడెక్కడ తిరిగాడు ? ఎవర్ని కలిశాడు ? అతని వల్ల ఎవరైనా కరోనా బాధితులుగా మారారా అన్నది తెలుసుకోవటం పెద్ద కష్టంగా మారింది.
గత సోమవారం రాత్రి తన బట్టలను తాడుగా మార్చి ఆస్పత్రి వార్డులోని కిటికీని బద్దలు కొట్టి పారిపోయాడు లోక్‌నాయక్ జయప్రకాశ్ నారాయన్ ( ఎల్‌ఎన్‌జేపీ) ఆసుపత్రి కరోనా బాధితుడు . ఇక కరోనా పాజిటివ్ ఉన్న అతడి వయస్సు 60 ఏళ్లని , నేపాల్ నుంచి వచ్చిన 17 మంది సభ్యుల్లో పారిపోయిన వ్యక్తి కూడా ఒకడని పేర్కొన్న అధికారులు ఫైనల్ గా అతణ్ణి పట్టుకున్నారు . ఇక పోలీసులు అతని కోసం సమీప గ్రామాల్లో గాలింపు చేపట్టగా శనివారం హర్యానా రాష్ట్రంలోని రాయ్ గ్రామం వద్ద కనిపించాడు. దీంతో ఢిల్లీ పోలీసులు అతనిపై కేసు నమోదు చేసి, తిరిగి ఆసుపత్రిలో చేర్చారు.

అయితే అతడ్ని పట్టుకున్న పోలీసులకు మరో కొత్త సమస్య ఎదురైంది. అదేంటంటే ఈ వ్యక్తి మార్గమధ్యంలో ఎవరెవరిని కలిశాడన్నది ఇప్పుడు పోలీసులకు టాస్క్ గా మారింది . ప్రస్తుతం ఇదే అంశంపై దర్యాప్తు ప్రారంభించారు పోలీసులు. ఇక అతను ఎంత మందికి కరోనా వ్యాప్తి అయ్యేలా చేస్తాడో అని ఆందోళన చెందుతున్నారు. ఇక ఇటీవల ప్రకాశం జిల్లా ఒంగోలులో రిమ్స్ ఐసొలేషన్ వార్డు నుంచి కరోనా లక్షణాలున్న యువకుడు తప్పించుకుపోవడం కూడా సంచలనం సృష్టించింది .తబ్లీఘీ జమాత్ మత ప్రచార సభకు వెళ్లి వచ్చిన యువకుడే కావటం గమనార్హం . ఇక యూపీలో తప్పించుకుని పట్టుబడిన వ్యక్తి కూడా తబ్లీఘీ జమాత్ కు చెందిన వారే కావటం గమనార్హం .
Recommended Video
-
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా?












Click it and Unblock the Notifications