మోదీ స్పీచ్ యమ బోర్.. మ్యాథ్స్ డబల్ క్లాస్‌లో కూర్చునట్టయింది: ప్రియాంక గాంధీ

Priyanka Gandhi Vadra: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లోక్‌సభలో ఇచ్చిన ప్రసంగంపై కాంగ్రెస్ లోక్‌సభ సభ్యురాలు ప్రియాంక గాంధీ వాద్రా సెటైర్లు వేశారు. అసాంతం బోర్ కొట్టిందని వ్యాఖ్యానించారు. ఏదైనా కొత్త విషయాన్ని చెబుతారేమోనని ఆసక్తిగా విన్నానని, ఎక్కడే గానీ అలాంటి ఊసే లేదని చెప్పారు. పాత అంశాలనే మళ్లీ మళ్లీ ఉటంకించారని అన్నారు.

శీతాకాల సమావేశాల సందర్భంగా లోక్‌సభలో రాజ్యాంగంపై రెండు రోజుల పాటు వాడి వేడిగా చర్చ జరిగిన విషయం తెలిసిందే. కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సహా పలువురు మంత్రులు, సభ్యులు ఈ చర్చల్లో పాల్గొన్నారు. రాజ్యాంగం, అందులో చోటు చేసుకుంటూ వచ్చిన సవరణలపై విమర్శనాస్త్రాలను సంధించుకున్నారు.

Absolutely Bored Me did not say anything new says Priyanka Gandhi on PM Modi s Speech

ఈ చర్చకు ప్రధాని మోదీ సమాధానం ఇచ్చారు. శనివారం సాయంత్రం ఆయన సభలో ప్రసంగించారు. సుదీర్ఘంగా సాగిందాయన ప్రసంగం. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ హయాంలో దేశంలో అమలు చేసిన ఎమర్జెన్సీ సహా పలు అంశాలను ప్రస్తావించారు. దశాబ్దాల కాలం పాటు దేశాన్ని పరిపాలించిన కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్న లోపాలను ఎత్తిచూపారు.

అలాగే- 11 ప్రతిజ్ఞలను ప్రతిపాదించారు మోదీ. రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడటం, 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దడంలో భాగంగా వీటిని ప్రస్తావించారు. అందరికీ సమాన అభివృద్ధి, అవినీతి రహితంగా దేశాన్ని తీర్చిదిద్దడం, మతం ప్రాతిపదికన రిజర్వేషన్లకు స్వస్తి పలకడం.. ఇందులో ఉన్నాయి. మోదీ ప్రసంగం ముగిసిన అనంతరం సభ సోమవారానికి వాయిదా పడింది.

ఈ సందర్భంగా మోదీ ప్రసంగంపై పార్లమెంట్ ఆవరణలో సభ్యులు తమ అభిప్రాయాలను తెలియజేశారు. ప్రియాంక గాంధీ వాద్రా మాట్లాడారు. మోదీ ప్రసంగం పూర్తిగా బోర్ కొట్టిందని, చెప్పిందే చెప్పారని వ్యాఖ్యానించారు. ఒక్క కొత్త విషయాన్ని కూడా ఆయన ప్రస్తావించలేదని చెప్పారు. చిన్నప్పుడు స్కూల్‌లో మ్యాథ్స్ డబుల్ క్లాస్‌లో కూర్చున్నట్టయిందని సెటైర్ వేశారు.

మోదీ ప్రసంగాన్ని వినలేక ఆయనే పక్కనే కూర్చున్న కేంద్ర మంత్రులు అమిత్ షా, జేపీ నడ్డా, పియూష్ గోయెల్ సైతం దిక్కులు చూస్తూ గడిపారని, నిద్రావస్థలో కనిపించారని ప్రియాంక గాంధీ ఎద్దేవా చేశారు. తన అపార రాజకీయ అనుభవాన్ని రంగరించి రాజ్యాంగంపై చక్కటి స్పీచ్ ఇస్తారని ఆసక్తిగా ఎదురు చూశానని, అలాంటివేవీ లేవని అన్నారు. అవినీతిని అణచివేస్తామన్నప్పుడు అదానిపై మాట్లాడటానికి ఇబ్బందేముందని ప్రశ్నించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+