అందమైన ఆంటీని అరాచకంగా చంపేశారు. ఇంజనీర్ భర్త గోవాలో, కొడుకు ఎంబీబీఎస్ !
బెంగళూరు/శివమొగ్గ: భర్త ఇంజనీర్ గా ఉద్యోగం చేస్తున్నాడు. భార్య ఇంట్లోనే ఉంటున్నది. కొడుకు బెంగళూరు సిటీలోని ప్రముఖ మెడికల్ కాలేజ్ లో ఎంబీబీఎస్ చదువుతున్నాడు. భర్త కూడా వేరే ఊరిలో ఉద్యోగం చేస్తున్నాడు. ఫ్రెండ్స్ తో కలిసి భర్త గోవా టూర్ వెళ్లాడు. ఇదే సమయంలో అందంగా ఉన్న మహిళ ఆమె ఇంటిలోనే దారుణ హత్యకు గురికావడం కలకలం రేపింది.
మహిళ నోటిలో గుడ్డలు కుక్కి ఆమెను హత్య చేసిన ఘటన కర్ణాటకలోని శివమొగ్గ జిల్లాలోని విజయనగరంలో చోటుచేసుకుంది. కమలమ్మ అలియాస్ కమల (50) అనే మహిళను దుండగులు హత్య చేశారు. హోస్‌దుర్గలో పీడబ్ల్యూడీ శాఖలో ఇంజినీర్‌గా పనిచేస్తున్న మల్లికార్జున్ భార్య కమల.
భర్త మల్లికార్జున్ హోసదుర్గాలో ఉద్యోగం చేస్తూ వీకెండ్ లో ఇంటికి వచ్చి వెలుతున్నాడని సమాచారం.

కమల ఇంట్లో ఒంటరిగా ఉందని తెలుసుకున్న నిందితులు ఆమె ఇంట్లోకి చొరబడ్డారు. ఎవరు మీరు అని కమల ఆ నిందితులను ప్రశ్నించింది. దుండగులను ప్రతిఘటించిన కమల తప్పించుకోవడానికి ప్రయత్నించింది. అయితే కమలను వదలిపెట్టని దుండగులు ఆమెను పట్టుకుని ఆమె నోటికి బట్టలు బిగించి ఉక్కిరిబిక్కిరి చేశారు. కమల గొంతు కోసి హత్య చేసిన అనంతరం ఇంట్లోని నగదు, నగలను దుండగులు ఎత్తుకెళ్లారు.
గోవాకు టూర్ వెళ్లిన భర్త మల్లికార్జున్ ఆదివారం ఆయన భార్య కమల మొబైల్‌కి చాలాసార్లు ఫోన్లు చేసినా కమల కాల్ రిసీవ్ చెయ్యలేదు. భార్య కమల కాల్ రిసీవ్ చెయ్యకపోవడంతో ఆందోళన చెందిన ఆమె భర్త మల్లికార్జున్ పక్కింటి వారికి ఫోన్ చేసి ఇంటికి వెళ్లి చూడమని చెప్పాడు. దీంతో ఇరుగుపొరుగు వారు మల్లికార్జున్ ఇంటికి వచ్చి చూడగా కమల హత్యకు గురైన విషయం వెలుగులోకి వచ్చింది. ఇరుగుపొరుగు వారి నుంచి విషయం తెలుసుకున్న భర్త మల్లికార్జున్ గోవా నుంచి ఇంటికి చేరుకున్నాడు.
కమలను తెలిసి వాళ్లే హత్య చేశారా ?, హత్య చేసి నగదు, నగలు దోచుకుని హత్య కేసు తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నించారా ?, మరేమైనా కారణాలు ఉన్నాయా ? అని ఆరా తీస్తున్నామని శివమొగ్గ జిల్లా పోలీసులు తెలిపారు. ప్రభుత్వ శాఖలో ఇంజనీర్ గా ఉద్యోగం చేస్తున్న వ్యక్తి భార్య హత్యకు గురికావడం శివమొగ్గలో కలకలం రేపింది.

ఈ ఘటనపై సమాచారం అందుకున్న తుంగా నగర్ పోలీస్ స్టేషన్ ఇన్స్ పెక్టర్ మంజునాథ్ ఆధ్వర్యంలోని బృందం సంఘటనా స్థలాన్ని సందర్శించి పరిశీలించింది. ప్రస్తుతం దావణగెరె ఫోరెన్సిక్ పోలీసుల బృందం శివమొగ్గ చేరుకుని కమలమ్మ అలియాస్ కమల హత్యకు గురైన తీరు పరిశీలించి సాక్షాలు సేకరించారు. కమలను హత్య చేసి నగదు, బీరువాలో ఉన్న నగలు దోచుకెళ్లారని పోలీసులు అంటున్నారు.
అయితే కమల శరీరం మీద ఉన్న బంగారు మంగళసూత్రం, బంగారు గాజులు, ఆమె కమ్మలు, ఉంగారాలను దుండగులు తీసుకోకుండా వదిలేసి వెళ్లడంతో అనేక అనుమానాలు వస్తున్నాయని పోలీసులు అంటున్నారు. దంపతుల మనస్పర్థల నేపథ్యంలోనే కమలమ్మ అలియాస్ కమల హత్యకు గురైయ్యిందని స్థానికులు అనుమానిస్తున్నారు. కమలమ్మ కుమారుడు బెంగళూరులో ఎంబీబీఎస్ చదువుతున్నాడు. విషయం తెలుసుకున్న కమలమ్మ కుమారుడు బెంగళూరు నుంచి బయలుదేరి శివమొగ్గ చేరుకున్నాడు.












Click it and Unblock the Notifications