Viral Video: ప్లాట్ ఫారమ్ పైకి దూసుకొచ్చిన ట్రైన్.. వైరల్ అయిన లోకో పైలట్ వీడియో..
ఉత్తర్‌ప్రదేశ్‌లోని మధుర స్టేషన్‌లో మంగళవారం ట్రైన్ యాక్సిడెంట్ జరిగింది. రాత్రి 11 గంటల సమయంలో ఓ రైలు ప్లాట్‌ఫాంపైకి దూసుకొచ్చింది. అయితే ప్రయాణికులు అప్పటికే దిగిపోవడంతో ప్రాణనష్టం తప్పింది. ప్లాట్ పామ్ ఉన్న ప్రయాణికులు పరుగులు తీశారు. "షకుర్ బస్తీ నుంచి వస్తున్న ఈఎంయూ(ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్) ట్రైన్ 10:49 గంటలకు మధుర స్టేషన్‌కు వచ్చి ఆగింది. ప్రయాణికులందరూ రైలు నుంచి దిగి వెళ్లిపోయారు. అకస్మాత్తుగా రైలు ప్లాట్‌ఫాంపైకి దూసుకొచ్చింది" అని మధుర స్టేషన్ డైరెక్టర్ ఎస్.కే. శ్రీవాస్తవ వెల్లడించారు.
यूपी के मथुरा में एक अजीबोगरीब हादसे में मथुरा जंक्शन रेलवे स्टेशन पर एक लोकल ट्रेन प्लेटफॉर्म से टकरा गई. किसी के हताहत होने की सूचना नहीं है.#Mathura #MathuraJunction pic.twitter.com/ODdtgKinUl
— iMayankofficial 🇮🇳 (@imayankindian) September 26, 2023
ఈ ప్రమాదం పై అధికారులు విచారణ చేపట్టగా.. అస్సలు విషయం బయటకొచ్చింది. లోకో పైలట్ వీడియో కాల్ మాట్లాడుతూ నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఆగిన రైలు కాస్తా ప్లాట్‌ఫారంపైకి ఎక్కి కరెంటు స్తంభాన్ని ఢీకొట్టినట్లు విచారణ అధికారులు గుర్తించారు. ఈ ప్రమాదంలో ఒక మహిళ విద్యుదాఘాతానికి గురైన సంగతి తెలిసిందే. లోకో పైలట్ నిర్లక్ష్యానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియోలో ఢిల్లీ షకుర్ బస్తీ నుంచి వచ్చిన ఎలెక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్(ఈఎంయూ) రైలు మధుర జంక్షన్ స్టేషన్‌కు చేరుకోగానే అప్పటివరకు విధులు నిర్వహించిన లోకోపైలట్ రైలు ఆగిన తర్వాత కిందికి దిగి వెళ్లిపోయాడు.

మరో లోకో పైలట్ సచిన్ విధులు నిర్వహించేందుకు ట్రైన్ ఎక్కాడు. అతను ఫోన్ లో వీడియో కాల్ మాట్లాడుకుంటూ లోకో పైలట్ రూమ్ వచ్చాడు. వీడియో కాల్‌లో బిజీగా ఉన్న సచిన్ భుజానికున్న బ్యాగును తీసి ఇంజిన్ రాడ్ పైన పెట్టాడు. ఆ బరువుకు ఇంజిన్ హ్యాండిల్ ముందుకు కదలడంతో రైలు ముందుకు దూసుకెళ్లింది. గమనించిన అతను బ్యాగ్ తీశాడు. కానీ ట్రైన్ అప్పటికే ప్లాట్ ఫారమ్ పైకి దూసుకెళ్లింది. కొద్ది దూరం వెళ్లి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ క్రమంలో ఓ మహిళా పై విద్యుత్ వైర్లు పడి గాయపడింది.
मथुरा ट्रेन हादसे के समय मोबाइल देख रहा था ड्राइवर। CCTV से ट्रेन के प्लेटफॉर्म पर चढ़ने का राज खुला। इसका वीडियो सोशल मीडिया पर वायरल हो रहा है।
— FirstBiharJharkhand (@firstbiharnews) September 28, 2023
#MathuraJunction #TrainAccident #CCTV pic.twitter.com/muia6Zu2Gi
ఈ ప్రమాదంతో మాల్వా సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్, అమృత్‌సర్-బాంద్రా ఎక్స్‌ప్రెస్, దక్షిణ ఎక్స్‌ప్రెస్ రైళ్లకు అంతరాయం ఏర్పడింది. ఈ ఘటన కు బాధ్యులైన లోకో పైలట్ సచిన్ తో పాటు మరో నలురుగిని రైల్వే శాఖ సస్పెండ్ చేసింది. ఒడిశాల జరిగిన ఘోర రైలు ప్రమాదానికి కూడా మానవ తప్పిదమే కారణంగా తెలిసింది.
-
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక












Click it and Unblock the Notifications