• search

రేపిస్టును చెప్పుతో చితక్కొట్టిన తృప్తి దేశాయ్(వీడియో)

Subscribe to Oneindia Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  పుణె: పలు ఆలయాల్లో హిందూ మహిళలకు, మసీదుల్లో ముస్లిం మహిళలకు ప్రవేశం కల్పించాలంటూ ఇటీవల ఉద్యమించి వార్తల్లో నిలిచిన భూమాత బ్రిగేడ్‌ అధ్యక్షురాలు తృప్తి దేశాయ్‌ మరోసారి సంచలనంగా మారారు. ఇంతకీ ఆమె ఏం చేశారంటే.. పెళ్లి చేసుకుంటానని నమ్మించి మహిళపై అత్యాచారానికి పాల్పడిన ఓ వ్యక్తిని నడిరోడ్డుపై చితకబాదారు.

  ఈ విషయాన్ని స్వయంగా ఆమె చెప్పడమే గాక.. ఘటనను వీడియో తీయించి అందరికీ పంపించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. లాంధే అనే వ్యక్తి 24ఏళ్ల యువతిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతేగాక, బాధితురాలు గర్భం దాల్చడంతో ఆమెకు బలవంతంగా అబార్షన్‌ చేయించాడు.

  సదరు యువతి నుంచి విషయం తెలుసుకున్న తృప్తి అతనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం లాంధేను పట్టుకుని నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే చెప్పుతో చితకబాదారు. సమాచారమందుకున్న స్థానిక పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి, కేసు నమోదు చేశారు.

   Activist Trupti Desai Thrashes Rape Accused On Camera To 'Teach Him A Lesson'

  ఈ ఘటనపై తృప్తి మాట్లాడుతూ.. బాధితురాలు గతంలో పోలీసుల దగ్గరకు వెళ్లిందని.. అయితే లాంధే ఆమెను పెళ్లి చేసుకుంటానని సర్దిచెప్పడంతో ఎలాంటి ఫిర్యాదు చేయలేదని చెప్పారు.

  అయితే లాంధే మరోసారి మాటతప్పడంతో సదరు యువతితనను కలిసినట్లు చెప్పారు. ఈ విషయమై తాము లాంధే తల్లిదండ్రులతో సంప్రదించగా వారు కూడా పెళ్లికి ఒప్పుకోలేదని.. పైగా బాధితురాలికి డబ్బులు ఇచ్చి సెటిల్‌మెంట్‌ చేస్తామన్నారని తృప్తి తెలిపారు.

  ఈ క్రమంలో లాంధేకు తగిన గుణపాఠం చెప్పాలని నిర్ణయించుకున్నామని, అందుకే నిందితుడిపై దాడి చేశామని చెప్పారు. మహిళలపై ఎలాంటి అఘాయిత్యాలు జరిగినా వూరుకునేది లేదని హెచ్చరించారు.

  తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  In a video widely shared, women rights activist Trupti Desai is seen holding a slipper and beating a man with it in a village near Pune in Maharashtra, while people gather around and watch.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more