సీఎం మమతా బెనర్జీకి నేను వీరాభిమాని, కమల్ హాసన్, కోల్ కతాలో హీరో, నేడు ఆమెతో భేటీ !

Posted By:
Subscribe to Oneindia Telugu

కోల్ కతా: తమిళనాడు రాజకీయాల్లో ప్రవేశించి చక్రం తిప్పాలని ప్రయత్నిస్తున్న బహుబాష నటుడు, దర్శకుడు కమల్ హాసన్ శుక్రవారం చెన్నై నుంచి కోల్ కతా వెళ్లారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో కమల్ హాసన్ ఈరోజు భేటీ కానున్నారు.

శుక్రవారం సాయంత్రం కోల్ కతా విమానాశ్రయంలో అడుగు పెట్టిన వెంటనే కమల్ హాసన్ మీడియాతో మాట్లాడారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి తాను వీరాభిమాని అంటూ కమల్ హాసన్ మీడియాకు చెప్పారు. మమతా బెనర్జీ దేశం గర్వించదగిన రాజకీయ నాయకురాలు అని కమల్ హాసన్ కితాబు ఇచ్చారు.

Actor Kamal Haasan says he is big fan WB CM Mamta Banerjee

మమతా బెనర్జీతో భేటీ అయిన తరువాత ఆమె దగ్గర రాజకీయాల గురించి సూచనలు, సలహాలు తీసుకుంటానని కమల్ హాసన్ వివరించారు. కోల్ కతాలో జరుగుతున్న ఇంటర్నేషన్ ఫిల్మ్ ఫెస్టివల్ కార్యాక్రమానికి హాజరు కావడానికి కమల్ హాసన్ పశ్చిమ బెంగాల్ వెళ్లారు. చాల కాలం నుంచి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో భేటీ కావాలని ప్రయత్నిస్తున్న కమల్ హాసన్ చివరికి శుక్రవారం ఆమెతో భేటీ కానున్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Actor Kamalhaasan who is at Kolkatta international film festival says to the media at Kolkatta airport that he is a big fan of Westbengal CM Mamta banerjee.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి