వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేరళ పూరమ్‌ ఉత్సవాల్లో ఏనుగులు ఉపయోగించొద్దన్న హాలీవుడ్ నటి

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

కొచ్చి: కేరళీయుల సాంప్రదాయమైన పండుగైన త్రిసూర్‌ పూరమ్‌ ఉత్సవాల్లో ఏనుగులను ఉపయోగించవద్దంటూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉమెన్ చాందీకి ఈ మెయిల్ ద్వారా లేఖ రాశారు ప్రముఖ హాలీవుడ్ నటి పమేలా ఆండర్సన్.

ముఖ్యమంత్రి ఉమెన్ చాందీకి రాసిన ఈమెయిల్‌లో ఉత్సవాల్లో ఉపయోగించే ఏనుగులను భారత జంతు రక్షణ సంస్థ(ఏడబ్ల్యూబీఐ)లో నమోదు చేయించాలని, కానీ రానున్న ఉత్సవాలకు సంబంధించి కేరళ ప్రభుత్వం ఎలాంటి నమోదు చేయలేదని ఆమె పేర్కొన్నారు.

అంతే కాదు ఈ ఏడాది త్రిసూర్‌ పూరమ్‌ ఉత్సవాల్లో ఏనుగులను ఉపయోగించవద్దని ఆమె కోరారు. పీపుల్ ఫర్ ఎథికల్ ట్రీట్మెంట్ ఆఫ్ యానిమల్స్ (పెటా) తరుపున జంతు సంరక్షణకు పోరాడుతున్నా విషయాన్ని ఆమె గుర్తు చేస్తూ కేరళలో రెండు రోజులు ముందు ప్రారంభం కానున్న ఈ ఉత్సవాలను పురస్కరించుకుని ఈ ఈమెయిల్ రాశారు.

Actor Pamela Anderson Asks Kerala Chief Minister Not to Use Elephants for Kerala Festival

ప్రతి ఏడాది కేరళలోని త్రిసూర్ పట్టణంలో ఉన్న వడక్కుంతన్ ఆలయంలో పూరమ్ ఉత్సవాలను ఏనుగులతో ఘనంగా నిర్విహిస్తారు. ఈ ఉత్సవాలకు వచ్చే జనం ఏనుగులను కొట్టడం, తీయడం చేస్తారు. పెటా చట్ట ప్రకారం ఏనుగులను ఫొటోలు తీయడం కూడా నేరమేనని ఆమె ఈమెయల్‌లో పేర్కొన్నారు.

మరి ఈ ఈమెయిల్‌పై అటు కేరళ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి మరి. దేశంలో కేబుల్ టీవీ వచ్చిన తొలినాళ్లలో బేవాచ్ అనే కార్యక్రమానికి విపరీతమైన క్రేజ్ ఉండేది. బీచ్‌లో సేద తీరడానికి వచ్చే ప్రజలు ఏదైనా ప్రమాదానికి గురైతే వారిని కాపాడేందుకు ఒక బృందం ఉంటుంది.

ఆ బృందంలోని సభ్యుల్లో చోటు చేసుకున్న డ్రామతో బేవాచ్ సిరిస్‌ను టీవీలో తెరకెక్కించారు. ఈ టీవీ సిరిస్‌తో బాగా పాపులారిటీని దక్కించుకున్న హీరోయిన పమేలా అండర్సన్. హాలీవుడ్‌లో పలు సూపర్ హిట్ సినిమాల్లో కూడా నటించారు.

English summary
As the stage is set for Kerala's iconic festival Thrissur pooram, Hollywood actress Pamela Anderson has written to Kerala Chief Minister Oommen Chandy asking him not to the use elephants for the festival.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X