కమల్ హాసన్ మీద పవర్ స్టార్ ఫైర్, దిగజారి మాట్లాడారు, ధైర్యం ఉంటే ముందు రా !

Posted By:
Subscribe to Oneindia Telugu

చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత ప్రాతినిధ్యం వహించి ఆమె మృతితో జరిగిన ఆర్ కే నగర్ ఉప ఎన్నికలపై బహుబాష నటుడు, దర్శక నిర్మాత కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలపై తమిళ నటుడు, వపర్ స్టార్ డాక్టర్ శ్రీనివాసన్ మండిపడ్డారు..

ఆర్ కే నగర్ ఓటర్లు

ఆర్ కే నగర్ ఓటర్లు

ఆర్ కే నగర్ ఉప ఎన్నికల్లో టీటీవీ దినకరన్ ఓటుకు రూ. 20 వేలు ఇచ్చి విజయం సాధించారని, అక్కడి ఓటర్లు దొంగ దగ్గర బిక్షం ఎత్తుకున్నారని హీరో కమల్ హాసన్ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయంతెలిసిందే. ఈ విషయంపై పవర్ స్టార్ డాక్టర్ శ్రీనివాసన్ తనదైన శైలిలో స్పంధించారు.

 దిగజారి మాట్లాడిన కమల్

దిగజారి మాట్లాడిన కమల్

కమల్ హాసన్ స్థాయికి తగ్గట్లు మాట్లాడటం లేదని, దిగజారి మాట్లాడుతున్నారని పవర్ స్టార్ డాక్టర్ శ్రీనివాసన్ విమర్శించారు. ఆర్ కే నగర్ ప్రజల మనోభావాలు దెబ్బ తినే విధంగా మాట్లాడిన హీరో కమల్ హాసన్ అక్కడి ఓటర్లకు వెంటనే క్షమాపణలు చెప్పాలని పవర్ స్టార్ డిమాండ్ చేశారు.

ధైర్యం ఉంటా రా

ధైర్యం ఉంటా రా

తమిళనాడు నుంచి ఢిల్లీ వరకు అందర్నీ మోసం చేసి తీహార్ జైలుకు వెళ్లిన నువ్వా మా అభిమాన హీరో గురించి మాట్లాడేది అంటూ పవర్ స్టార్ మీద కమల్ హాసన్ అభిమానులు మండిపడుతున్నారు. నీకు ధైర్యం ఉంటే మా ముందుకు వచ్చి మాట్లాడు చూద్దాం అని కమల్ అభిమానులు పవర్ స్టార్ శ్రీనివాసన్ కు సవాలు చేశారు.

కమల్, పవర్ స్టార్ ఫోటో వైరల్

కమల్, పవర్ స్టార్ ఫోటో వైరల్

కమల్ హాసన్ పక్కన వినయంగా నిలబడి ఫోటో తీసుకున్న పవర్ స్టార్ శ్రీనివాసన్ ఫోటో ఇప్పుడు వైరల్ అయ్యింది. అనేక మందికి బ్యాంకు రుణాలు ఇప్పిస్తానని, సినిమాల్లో చాన్స్ ఇప్పిస్తానని నమ్మించి మోసం చేశాడని పవర్ స్టార్ శ్రీనివాసన్ పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపించడంతో అతను జామీను మీద బయటకు వచ్చాడు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Actor Power star Srinivasan slams Actor Kamalhaasan on the talk of RK Nagar people. Power start says that Kamal Hassan speaks highly and indecently. Kamal haasan has insulted the RK Nagar.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి