ఔనా ? అన్నాడీఎంకే ఎమ్మెల్యే, నటుడు కరుణాస్ సంచలన వ్యాఖ్యలు !
తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి వర్గం, మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం వర్గం కలిసిపోవాలని అన్నాడీఎంకే పార్టీ ఎమ్మెల్యే, ప్రముఖ నటుడు కరుణాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అన్నాడీఎంకేలోని రెండు వర్గాల
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి వర్గం, మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం వర్గం కలిసిపోవాలని అన్నాడీఎంకే పార్టీ ఎమ్మెల్యే, ప్రముఖ నటుడు కరుణాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అన్నాడీఎంకేలోని రెండు వర్గాలు కలిసిపోవాలని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.
శనివారం చెన్నైలో ఎమ్మెల్యే కరుణాస్ మీడియాతో మాట్లాడారు. తమిళనాడులో అమ్మ జయలలిత పాలన మళ్లీ వికసించాలంటే పళనిసామి, పన్నీర్ సెల్వం వర్గాలు విలీనం కావాలని, ప్రజలు ఇదే కోరుకుంటున్నారని చెప్పి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు.

పన్నీర్ సెల్వం పార్టీ మీద తిరుగుబాటు చేసిన సమయంలో ఎమ్మెల్యే కరుణాస్ ఎడప్పాడి పళనిసామి వర్గంలోకి వెళ్లారు. తన నియోజక వర్గం అభివృద్ది కోసం ఎడప్పాడి పళనిసామి వర్గానికి మద్దతు ఇస్తున్నారని అప్పట్లో కరుణాస్ మీడియాకు చెప్పారు.
అదే సమయంలో పన్నీర్ సెల్వం మీద తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. నువ్వు మా ఎమ్మెల్యే కాదు, మా నియోజక వర్గంలో అడుగుపెడితే తగిన బుద్ది చెబుతామని కరుణాస్ ను ఆయన ప్రాతినిథ్య వహిస్తున్న తిరువదనై నియోజక వర్గం ప్రజలు హెచ్చరించారు.
ఆ భయంతో కరుణాస్ తన తిరువదనై నియోజక వర్గంలో అడుగుపెట్టలేదు. అయితే పళనిసామి వర్గంలో ఉన్న ఎమ్మెల్యే కరుణాస్ ఇప్పుడు కొత్తరాగం అందుకుని సొంత పార్టీ నాయకులను ఆశ్చర్యానికి గురి చేశాడు. తన నియోజక వర్గం ప్రజలకు దగ్గర కావడానికి కరుణాస్ కొత్త నాటకం ఆడుతున్నారని అన్నాడీఎంకే పార్టీ కార్యకర్తలు విమర్శిస్తున్నారు.












Click it and Unblock the Notifications