వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాజకీయాల్లోకి కరుణానిధి మనుమడు ఎంట్రీ, చెప్పిన రెండురోజుల్లో హీరో, ఎంపీ కనిమొళి!

|
Google Oneindia TeluguNews

చెన్నై: తమిళనాడు రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. తమిళనాడు రాజకీయాల్లో సినీరంగానికి చెందిన ప్రముఖలు ఎంట్రీ ఇస్తున్నారు. సూపర్ స్టార్ రజనీకాంత్, బహుబాష నటుడు కమల్ హాసన్ కొత్త రాజకీయ పార్టీలు పెడుతున్నారు. తాజాగా తమిళ సినీరంగంలో ప్రముఖ నటుడు, నిర్మాత, డీఎంకే పార్టీ అధ్యక్షుడు కరుణానిధి మనుమడు ఉదయానిధి స్టాలిన్ రాజకీయాల్లొ తొలి అడుగు వేశారు. హీరో ఎంట్రీకి మేనత్త కనిమెళి స్వాగతం పలికారు.

కరుణానిధి మనుమడు

కరుణానిధి మనుమడు

డీఎంకే పార్టీ అధ్యక్షుడు కరుణానిధి మనుమడు, ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, తమిళనాడు శాసన సభలో ప్రతిపక్ష నాయకుడు ఎంకే. స్టాలిన్ కుమారుడు ఉదయానిధి స్టాలిన్ తమిళ సినీరంగంలో ప్రముఖ హీరో, నిర్మాత. ఉదయానిధి స్టాలిన్ సినిమాలు చాల వరకు హిట్ అయ్యాయి.

 నేను పార్టీ కార్యకర్త

నేను పార్టీ కార్యకర్త

రెండు రోజుల క్రితం మీడియాతో మాట్లాడిన ఉదయానిధి స్టాలిన్ తాను చిన్నతనం నుంచి డీఎంకే పార్టీ కార్యకర్తగా ఉన్నానని చెప్పారు. అయితే తాను సినిమాలకే ఇంత కాలం పరిమితం అయ్యానని, పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారని ఉదయానిధి స్టాలిన్ అన్నారు.

ఉదయానిధి ఆసక్తి

ఉదయానిధి ఆసక్తి

తనకు రాజకీయాల్లోకి రావాలని ఆసక్తిగా ఉందని, పార్టీ నాయకత్వం ఆదేశిస్తే ఎన్నికల్లో పోటీ చేస్తానని, పార్టీ తరపున తమిళనాడులో ప్రచారం చేస్తానని రెండు రోజుల క్రితం ఉదయానిధి స్టాలిన్ మీడియాకు చెప్పారు.

డీఎంకే వ్యతిరేకం

డీఎంకే వ్యతిరేకం

రాజకీయాల్లోకి వస్తానని మీడియాకు చెప్పిన రెండు రోజుల్లో పార్టీ కార్యక్రమంలో ఉదయానిధి స్టాలిన్ ఎంట్రీ ఇచ్చాడు. తమిళనాడులో ఇటీవల ఒక్క సారిగా 67 శాతం ఆర్ టీసీ బస్సు చార్జీలు పెంచిన విషయం తెలిసిందే. ఆర్ టీసీ బస్సు చార్జీలను డీఎంకే పార్టీ తీవ్రస్థాయిలో వ్యతిరేకించింది.

చెన్నైలో హీరో ధర్నా

చెన్నైలో హీరో ధర్నా

ఆర్ టీసీ బస్సు చార్జీల పెంపును వ్యతిరేకిస్తూ తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా శనివారం డీఎంకే పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. చెన్నైలో డీఎంకే పార్టీ నిర్వహించిన ధర్నాలో హీరో ఉదయానిధి స్టాలిన్ నల్ల షర్టు వేసుకుని ఆర్ టీసీ బస్సు చార్జీలు వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ ధర్నాలో పాల్గొన్నారు. ఉదయానిధి స్టాలిన్ మొదటి సారి పార్టీ కార్యక్రమంలో పాల్గొనడంతో కార్యకర్తలు సంతోషం వ్యక్తం చేశారు.

 మేనత్త ఆహ్వానం

మేనత్త ఆహ్వానం

ఉదయానిధి స్టాలిన్ రాజకీయాల్లోకి వస్తే సంతోషమే, ఆయన డీఎంకే పార్టీకి సేవ చెయ్యాలని, ఈ పార్టీలో ఎవ్వరైనా చేరవచ్చని కరుణానిధి కుమార్తె, రాజ్యసభ సభ్యురాలు కనిమెళి అన్నారు. తన మేనల్లుడు రాజకీయాల్లోకి వస్తే చూడాలని ఉందని కనిమెళి చెప్పారు.

హీరో, నిర్మాత, దినపత్రిక

హీరో, నిర్మాత, దినపత్రిక

ఉదయానిధి స్టాలిన్ ప్రస్తుతం హీరోగా పలు సినిమాల్లో నటిస్తున్నారు. ఉదయానిధి స్టాలిన్ నిర్మాత. అంతే కాకుండా డీఎంకే పార్టీకి చెందిన మురసోలి దినపత్రిక వ్యవహారాలను ఉదయానిధి స్టాలిన్ చూసుకుంటున్నారు. ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చి మరింత బిజీ అవుతున్నాడు.

English summary
Udhayanidhi Stalin participated in DMK protest against bus fare hike, after his political entry announcement first time he participated in protest.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X