వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

90 ఏళ్ల వయసులో ఆ హీరో అంతరిక్ష యానం -బ్లూ ఆరిజిన్ రెండో టూర్ : కొత్త చరిత్ర ..!!

By Chaitanya
|
Google Oneindia TeluguNews

అంతరిక్ష యానంలో కొత్త చరిత్ర రికార్డు అయింది. అంతరిక్ష యానంలో పోటీ పడుతున్న ప్రయివేటు స్పేస్ ఆపరేటర్లు మరో ప్రయోగం చేసారు. జెఫ్​ బెజోస్​కు చెందిన ప్రైవేట్​ స్పేస్​ఏజెన్సీ సంస్థ బ్లూ ఆరిజిన్ చేపట్టిన రెండో మానవసహిత అంతరిక్ష ప్రయాణ ప్రయోగం విజయవంతంగా పూర్తైంది. గతంలో జెఫ్ బెజోస్ చేసిన అంతరిక్ష యానం..అంతకు ముందు వర్జిన్ గెలాక్టిన్ రిచర్డ్ సన్ చేసిన స్పేస్ ప్రయాణం రెండూ ప్రపంచ వ్యాప్తంగా చర్చకు దారి తీసాయి. ఇక, ఇప్పుడు జరిగిన అంతరిక్ష యానంలో ఒక ప్రత్యేకత ఉంది.

అప్పుడు రీల్..ఇప్పుడు రియల్

అప్పుడు రీల్..ఇప్పుడు రియల్

అప్పుడు సినిమాల్లో..ఇప్పుడు నిజ జీవితంలో ఒకే విధంగా కనిపించిన అరుదైన రికార్డు కెనడియన్‌ నటుడు విలియమ్‌ షాట్‌నర్‌ కు దక్కింది. తొంభై ఏళ్ల వయసులో అంతరిక్ష యానం చేసిన అత్యంత వయస్కుడిగా కొత్త చరిత్ర సృష్టించాడాయన. 11 నిమిషాల అంతరిక్షయానాన్ని తన జీవితంలో కలకాలం గుర్తుండిపోయే అనుభవమని చెప్పుకొచ్చారు. బ్లూ ఆరిజిన్ స్పేస్ టూర్ లో నటుడు విలియమ్​ షాట్​నర్​తో పాటు బ్లూ ఆరిజిన్​ ఎగ్జిక్యూటివ్​ ఆడ్రే పవర్స్​, ప్లాంట్​ లాబ్స్​ కో ఫౌండర్​ క్రిస్​ బోషుజెన్​, మెడిడేటా సొల్యూషన్​కు చెందిన గ్లోన్​ డె వ్రైస్​ 11 నిమిషాల అంతరిక్ష యానంలో పాల్గొన్నారు.

90 ఏళ్ల వయసులో అంతరిక్షంలో

90 ఏళ్ల వయసులో అంతరిక్షంలో

ఈ టూర్ లో షాట్ నర్ అనుభవం ప్రత్యేకంగా హైలైట్ అవుతోంది. ఆయన తన టూర్ తరువాత ఎమోషనల్ అయ్యారు. ఇదొక అద్భుతమైన అనుభూతి. మాటల్లో వర్ణించలేను. అంతరిక్షం నుంచి చూస్తే మన గ్రహం ఎంతో అందంగా కనిపించింది. అదేటైంలో ప్రమాదంలో ఉన్నట్లు అనిపించింది. దీనిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని చెప్పుకొచ్చారు. పశ్చిమ టెక్సాస్​ నుంచి అమెరికా కాలమానం ప్రకారం.. బుధవారం ఉదయం 9.49నిమిషాల సమయంలో బ్లూ ఆరిజిన్​ సబ్‌ఆర్బిటల్‌ రాకెట్‌(ఎన్‌ఎస్‌-18) నింగిలోకి ఎగిసింది.

ఊపు ఊపిన స్టార్ ట్రెక్

ఊపు ఊపిన స్టార్ ట్రెక్

దాదాపు 66 మైళ్ల ఎత్తులో అంతరిక్షంలో గడిపాక.. తిరిగి భూమ్మీదకు చేరుకుంది. అంతరిక్ష యానం పూర్తి చేసుకొని తిరిగి వచ్చిన టీంకు జెఫ్​ బెజోస్ క్యాప్సూల్​ దగ్గరికి స్వయంగా వెళ్లి ఆహ్వానం పలికారు. ఈ హీరో విలియమ్‌ షాట్‌నర్‌ 60వ దశకలో ప్రపంచాన్ని ఓ ఊపు ఊపిన 'స్టార్‌ ట్రెక్‌' ద్వారా పాపులారిటీ సంపాదించుకున్నారు. ఇంత క్రేజ్ ఉన్న హీరోను తమ సంస్థ ద్వారా స్పేస్ టూర్ కు పంపి మరింత ఆదరణ సంపాదించాలనేది జోఫ్ బెజోస్ ఆలోచన.

Recommended Video

Jeff Bezos Success Story, ఉద్యోగుల హీరో..!!
షాట్ నర్ కొత్త చరిత్ర

షాట్ నర్ కొత్త చరిత్ర

గతంలో నాసా అంతరిక్ష వ్యోమగామి జాన్‌ గ్లెన్‌ 77 ఏళ్ల వయసులో డిస్కవరీ షటిల్‌(1998) ద్వారా యానం పూర్తి చేయగా, అమెరికన్‌ ఏవియేటర్‌ వాలీ ఫంక్‌(82) ఈ ఏడాది జులైలో బ్లూ ఆరిజిన్‌ విజయవంతంగా పూర్తి చేసిన అంతరిక్ష యానం ద్వారా ఆ ఫీట్‌ బ్రేక్‌ చేశారు . అయితే వాలీఫంక్‌ వెళ్లొచ్చింది.. ఇప్పుడు 90 ఏళ్ల వయసున్న షాట్‌నర్‌ వెళ్లొచ్చేది కార్మన్‌ లైన్‌ దాకా మాత్రమే. ఇది భూమ్మీద నుంచి 100 కిలోమీటర్ల ఎత్తు మాత్రమే ఉంటుంది. స్టార్‌ ట్రెక్‌కు జెఫ్​ బెజోస్ వీరాభిమాని. ప్రస్తుత బ్లూ ఆరిజిన్​ ప్రయోగం ద్వారా ఇప్పటిదాకా 600 మంది అంతరిక్షయానం పూర్తి చేసుకున్నారు.

English summary
Actor William Shatner soared aboard a Blue Origin rocketship on a suborbital trip and landed in the Texas.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X