కారు డ్రైవర్ కుమారుడికి విజయ్ ప్రభుత్వంలో కీలక పదవి..!!

ముఖ్యమంత్రి విజయ్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన కారు డ్రైవర్ కుమారుడు శబరినాథన్‌ కు ఎమ్మెల్యే సీటు అందరి ప్రశంసలు అందుకున్నారు. ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన కు ఇప్పుడు లో కీలక పదవి అప్పగించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ అనూహ్య నియామకం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అసెంబ్లీ వేదికగా బల పరీక్ష ఎదుర్కొంటు న్న విజయ్.. వరుసగా అనూహ్య నిర్ణయాలు తీసుకుంటున్నారు.

ముఖ్యమంత్రి విజయ్ ఈ రోజు అసెంబ్లీలో బల పరీక్ష ఎదుర్కొంటున్నారు. 120 మంది ఎమ్మెల్యే ల మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన విజయ్ ఈ రోజు సభలో అధికారికంగా మెజార్టీ నిరూపణ కు సిద్దమయ్యారు. విజయ్ పార్టీ నుంచి 107 మంది ఉన్నారు. వారిలో ఒక ఎమ్మెల్యే ఓటింగ్ లో పాల్గొనకుండా కోర్టు నుంచి ఆదేశాలు ఉండటంతో... 106 మంది మద్దతు పార్టీ నుంచి రానుంది. ఇక, అయిదు మిత్రపక్షాల నుంచి 11 మంది ఉన్నారు. కాగా.. అన్నా డీఎంకే చీలిక వర్గానికి చెంది న 30 మంది ఎమ్మెల్యేలు విజయ్ కు మద్దతుగా నిలుస్తున్నారు. దీంతో.. వారు బల నిరూపణ వేళ సభకు గైర్హాజరు అయ్యే అవకాశం కనిపిస్తోంది. దీని ద్వారా సభలో సంఖ్యా బలం తగ్గి.. విజయ్ కు బల పరీక్షకు అవసరమైన సంఖ్యా బలం సులభంగా దక్కే ఛాన్స్ ఉంది. దీంతో.. ఈ రోజు సభలో చోటు చేసుకునే పరిణామాల పైన ఆసక్తి నెలకొంది.

 సీఎం విజయ్ పై ప్రశ్నకు రజనీకాంత్ ఊహించని రియాక్షన్..!!
సీఎం విజయ్ పై ప్రశ్నకు రజనీకాంత్ ఊహించని రియాక్షన్..!!
cm-vijay-has-been-appointed-mla-sabarinathan-as-the-government-whip-in-the-tamil-nadu-assembly

అసెంబ్లీలో బల పరీక్ష వేళ

ఇక, అసెంబ్లీలో ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం పూర్తయింది. స్పీకర్ ఎన్నిక జరిగింది. సీఎం విజయ్ ఇదే సమయంలో మరి కొన్ని కీలక నియామకాలు ఖరారు చేసారు. విజయ్ తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తన వద్ద కారు డ్రైవర్‌గా పనిచేస్తున్న రాజేంద్రన్ కుమారుడు శబరినాథన్‌కు విజయ్ తన పార్టీ తమిళగ వెట్రి కళగం (టీవీకే) తరఫున టికెట్ ఇచ్చారు. చెన్నైలోని విరుగంబాక్కం నియోజక వర్గం నుంచి పోటీ చేసిన శబరినాథన్ విజయం సాధించారు. విజయ్ కారు డ్రైవర్ కు సీటు ఇచ్చి.. గెలిపించుకోవటం ద్వారా సామాన్యులు సైతం ప్రశంసించారు. ఇక.. ఇప్పుడు శబరినాథన్ కు సీఎం విజయ్ అసెంబ్లీ ప్రభుత్వ చీఫ్ విప్ గా నియమించారు. ఈ నియామకం అందరనీ ఆశ్చర్యానికి గురి చేసింది. సాధారణంగా బలమైన ప్రతిపక్షం ఉన్న సమయంలో సీనియర్ కు ఈ పదవి అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంటారు. విజయ్ దీనిని భిన్నంగా శబరినాథన్ కు ఈ పదవి కట్టబెట్టారు. ఈ నియామకంపై సామాజిక మాధ్యమాల్లో మిశ్రమ స్పందనలు వ్యక్తమవుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+