పిల్లలముందే ఫ్రెంచ్ మహిళపై గ్యాంగ్ రే*ప్.. ఉరిశిక్ష ఖరారు చేసిన పాకిస్థాన్ కోర్టు..
పిల్లల ముందే తల్లిపై అత్యాచారానికి పాల్పడ్డారు ఇద్దరు నరరూప రాక్షసులు. ఈ షాకింగ్ ఘటన 2020 లో జరిగింది. పాకిస్థాన్ లాహోర్ లోని మోటర్ వే పై ఓ ఫ్రెంచ్ పర్యాటకురాలిపై ఇద్దరు దుండగులు అత్యాచారానికి పాల్పడ్డారు. ముగ్గురు పిల్లల ముందే సామూహిక అత్యాచారానికి ఒడిగడ్డారు. అయితే ఈ కేసులో ఇద్దరు నిందితులకు ట్రయల్ కోర్టు ఉరిశిక్ష విధించింది. అయితే తాజాగా లాహోర్ లోని హైకోర్టు ట్రయల్ కోర్ట్ తీర్పును సమర్థించింది.
ఈ మేరకు నిందితులు అబిద్ అలీ, షష్కత్ అలీ దాఖలు చేసిన అప్పీళ్లను కోర్టు తిరస్కరించింది. దాంతో ఆ నిందితులిద్దరికీ ఉరిశిక్ష ను విధించనున్నారు అధికారులు. 2021 లో ఉగ్రవాద నిరోధక కోర్టు తమను సామూహిక అత్యాచారం, కిడ్నాప్, దోపిడీ, ఉగ్రవాద నేరాల కింద దోషులుగా తేలుస్తూ తీర్పును వెల్లడించింది. అయితే ట్రయల్ కోర్టు తీర్పును నిందితులు లాహోర్ హైకోర్టులో సవాల్ చేశారు. అయితే హైకోర్టు తాజా నిర్ణయంతో ట్రయల్ కోర్టు విధించిన ఉరిశిక్ష యథాతథంగా కొనసాగనుంది.
అసలు ఏం జరిగింది..?
ఈ షాకింగ్ ఘటన 2020, సెప్టెంబర్ 9 న సియాల్ కోట్- లాహోర్ మోటార్ వే పై జరిగింది. ఫ్రెంచ్- పాకిస్థానీ సంతతికి చెందిన ఓ మహిళ తన ముగ్గురు పిల్లలతో కలిసి ఇదే హైవే పై ప్రయాణిస్తుండగా అర్ధరాత్రి సమయంలో ఆమె కారులో ఫ్యూయల్ అయిపోయింది. దాంతో ఆ మహిళ తన కారును రోడ్డు పక్కన నిలిపివేసింది. కార్ ను లాక్ చేసుకుని లోపలే కూర్చొంది.
అయితే నిందితులు కారు అద్దాలను పగలగొట్టి ఆమెను బలవంతంగా బయటకు లాగారు. పిల్లలపై తుపాకీ గురిపెట్టి వారిని భయపెట్టారు. అలా పిల్లలముందై ఆ మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. వెళ్లేటప్పుడు ఆమె వద్ద ఉన్న నగదు, నగలు, బ్యాంక్ కార్డులను కూడా దోచుకెళ్లారు. అయితే ఈ ఘటన జరిగిన కొద్ది రోజులకే నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఫోన్ డేటా, ఘటనాస్థలిలో లభించిన డీఎన్ఏ ఆధారంగా పోలీసులు నిందితుల్ని పట్టుకున్నారు. దాదాపు ఐదేళ్లుగా సాగిన వాదోపవాదాల తర్వాత తాజాగా పాకిస్థాన్ కోర్టు వారి ఉరిశిక్షను సమర్థించింది.

అయితే పాకిస్థాన్ కోర్టు సంచలన తీర్పుపై ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు. బ్రావో పాకిస్థాన్.. పాశ్చాత్య దేశాల్లోనూ ఇలాంటివి మనం చేయాలి అని పోస్టు చేశారు. తీవ్రమైన నేరాలకు కఠినమైన శిక్షలే సరైనవని పోస్టు పెట్టారు.












Click it and Unblock the Notifications