బంగారం ధరల ఉధృతి చల్లారినట్టేనా: నివురు గప్పిన నిప్పు?

నేడు పసిడి కొనుగొలుదారులకు కాస్తంత ఊరట లభించింది. అంతర్జాతీయంగా చోటుచేసుకుంటున్న భౌగోళిక రాజకీయ పరిణామాల నేపథ్యంలో దేశీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు దిగొచ్చాయి. బంగారం, వెండి ధరల్లో స్వల్ప తగ్గుదల నమోదైంది. రిటైల్ మార్కెట్లోనే కాకుండా మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX) లోనూ ధరల క్షీణత కనిపించింది. పండగల సీజన్ సమీపించిన ప్రస్తుత పరిస్థితుల్లో కొనుగోలుదారులకు కొంత ఉపశమనం కలిగించింది.

అమెరికా, ఇరాన్ మధ్య నెలకొన్న తాజా ఉద్రిక్తతలు పసిడి ధరలపై తీవ్ర ప్రభావం చూపాయి. ఇరాన్‌పై మునుపెన్నడూ లేని విధంగా అత్యంత కఠినమైన ఆర్థిక ఆంక్షలు విధించడం, వ్యూహాత్మక హార్ముజ్ జలసంధి గుండా నౌకల రాకపోకలను పూర్తిగా అడ్డుకుంటామని అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెస్సెంట్ వెల్లడించారు. దీంతో మరోసారి అనిశ్చిత పరిస్థితులు తలెత్తాయి. ఇవి.. గ్లోబల్ మార్కెట్‌లో మార్పులకు దారి తీశాయి.

Gold Prices Drop in India as US Vows Never-Before-Seen Measures Against Iran Threat of Stricter Curbs

అటు బ్రిటన్ వృద్ధి రేటు మందగించడం కూడా ఈ పరిణామాలకు ఒక కారణంగా భావిస్తోన్నారు. దేశీయంగా కమోడిటీ మార్కెట్ లోనూ దీని ప్రభావం స్పష్టంగా కనిపించింది. ఎంసీఎక్స్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరలో 0.55 శాతం తగ్గుదల కనిపించింది. రూ.1,52,750 వద్ద ట్రేడ్ అయింది. వెండి ఫ్యూచర్స్ ధర కూడా 0.98 శాతం క్షీణించి, కిలో రూ.2,34,480 గా నమోదైంది. ఫలితంగా రిటైల్ లో మార్కెట్ లో వీటి రేట్లు తగ్గాయి.

వాస్తు ప్రకారం తులసి వద్ద ఉంచకూడని వస్తువులు..!!
వాస్తు ప్రకారం తులసి వద్ద ఉంచకూడని వస్తువులు..!!

గురువారం నాటి క్లోజింగ్ సెషన్స్ తో పోల్చుకుంటే 24 క్యారెట్లల్లో రూ. 710, 22 క్యారెట్లల్లో రూ. 650, 18 క్యారెట్లల్లో రూ. 530 మేర తగ్గుదల నమోదైంది. ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,52,360, 22 క్యారెట్లు రూ. 1,39,663 గా రికార్డయింది. ఇక్కడ వెండి కిలో రూ. 2,33,770 పలికింది. బెంగళూరులో 24 క్యారెట్లు రూ. 1,52,480 కాగా 22 క్యారెట్లు రూ. 136,950 వద్ద స్థిరపడింది. ఇక్కడ వెండి ధర రూ. 2,33,950 గా రికార్డయింది.

భారత్‌ను 'వాచ్‌లిస్ట్‌' లో పెట్టిన అమెరికా: ఇకపై.. !!
భారత్‌ను 'వాచ్‌లిస్ట్‌' లో పెట్టిన అమెరికా: ఇకపై.. !!

హైదరాబాద్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,52,600, 22 క్యారెట్లు రూ. 1,39,883 వద్ద కొనసాగింది. కిలో వెండి రూ. 2,34,140 పలుకుతోంది. చెన్నైలో 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి రేటు రూ. 1,52,880, 22 క్యారెట్లు రూ. 1,40,140 వద్ద ట్రేడ్ అయింది. ఇక్కడ కిలో వెండి ధర రూ. 2,34,450.

వివిధ నగరాల్లో నేడు నమోదైన బంగారం రేట్లు ఒక గ్రాముకు ఇలా ఉన్నాయి.

చెన్నై..

24 క్యారెట్లు- రూ. 15,317, 22 క్యారెట్లు - రూ. 14,040, 18 క్యారెట్లు - రూ. 11,820

ముంబై..

24 క్యారెట్లు - రూ. 15,289, 22 క్యారెట్లు- రూ. 14,015, 18 క్యారెట్లు - రూ. 11,467

బెంగళూరు..

24 క్యారెట్లు - రూ. 15,289, 22 క్యారెట్లు- రూ. 14,015, 18 క్యారెట్లు - రూ. 11,467

హైదరాబాద్..

24 క్యారెట్లు - రూ. 15,289, 22 క్యారెట్లు- రూ. 14,015, 18 క్యారెట్లు - రూ. 11,467

విజయవాడ..

24 క్యారెట్లు - రూ. 15,289, 22 క్యారెట్లు- రూ. 14,015, 18 క్యారెట్లు - రూ. 11,467

విశాఖపట్నం..

24 క్యారెట్లు - రూ. 15,289, 22 క్యారెట్లు- రూ. 14,015, 18 క్యారెట్లు - రూ. 11,467

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+