70 లక్షల ఓట్ల తొలగింపు- రేవంత్ అలర్ట్: కొత్త లెక్కలు..లాభం వారికేనా..!?

రాష్ట్రంలో ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ (సర్‌) కొత్త టెన్షన్ కు కారణమవుతోంది. 70 లక్షల ఓట్ల తొలిగింపు వ్యవహారం రాజకీయంగా ఉత్కంఠ పెంచుతోంది. ఈ ఓట్ల వ్యవహారం పైన ఎన్నికల సంఘం స్పష్టత ఇస్తోంది. అటు సీఎం రేవంత్ ఈ ఓట్ల లెక్కల వెనుక కుట్రలు చేస్తున్నా రని చేసిన వ్యాఖ్యలు ఆసక్తిగా మారాయి. పార్టీ నేతలకు కీలక ఆదేశాలు ఇచ్చారు. దీంతో.. అసలు ఈ ఓట్ల తొలిగింపు ఎవరికి మేలు చేస్తుందీ.. ఎవరికి నష్టం చేస్తుందనేది కీలకంగా మారుతోంది.

తెలంగాణలో సర్ ప్రక్రియ పూర్తయింది. మరో రెండు రోజుల్లో ఓటర్లు ముసాయిదా ప్రకటించేలా తుది కసరత్తు కొనసాగుతోంది. ఈ సమయంలోనే రాష్ట్రంలో 70 లక్షల మంది ఓటు హక్కు తొలగించేందుకు కొందరు కుట్రలు చేస్తున్నారని, ఆ కుతంత్రాలను విజయవంతం కానీయ మని సీఎం రేవంత్ వ్యాఖ్యానించారు. సరైన చర్యలు తీసుకోకపోతే 21 శాతం ఓట్లు ప్రభావితమయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఆ పరిస్థితిని వెంటనే చక్కదిద్దాలని పార్టీ శ్రేణులను రేవంత్ ఆదేశించారు. తాజా ప్రక్రియలో హైదరాబాద్ లోనే ఎక్కువ ఓట్లు తొలగించారు. సొంత గ్రామాల్లో ఉన్న ఓటు కొనసాగిస్తూ.. హైదరాబాద్ లోనూ ఓటు ఉన్న వారివి పెద్ద సంఖ్యలో తెలిగించినట్లు అంచనా వేస్తున్నారు. అదే సమయంలో ఏపీలో ఓటు ఉండి.. హైదరాబాద్ లోనూ ఓటు ఉన్న వారికీ తెలిగించినట్లు గుర్తించారు. చాలా మందికి ఏపీతో పాటుగా తెలంగాణలోనూ ఓట్లున్నాయి. తాజా ప్రక్రియలో భాగంగా చాలా మంది ఆంధ్రప్రదేశ్ లోనే తమ ఓటు హక్కును ఉంచుకునేలా నిర్ణయం తీసుకున్నారు.

కొత్తగా వీరికీ ఉచిత విద్యుత్, రూ.500 వంట గ్యాస్ పథకాల అమలు- మార్గదర్శకాలు..!!
కొత్తగా వీరికీ ఉచిత విద్యుత్, రూ.500 వంట గ్యాస్ పథకాల అమలు- మార్గదర్శకాలు..!!
cm-revanth-reddy-alleges-conspiracy-to-delete-lakhs-of-telangana-votes-during-sir-key-directions-f

ముసాయిదా విడుదల.. పార్టీలు అప్రమత్తం

కాగా.. ఇప్పుడు ఈ ఓట్ల తొలిగింపు తో ఎవరికి నష్టం చేస్తుందనే విశ్లేషణలు మొదలయ్యాయి. ఏపీ కి చెందిన వారు తెలంగాణలో ఎక్కువగా బీజేపీ, కాంగ్రెస్ కే ఓట్లు వేస్తారనే అంచనాలు ఉన్నాయి. అదే సమయంలో 2023 లో బీఆర్ఎస్ వైపూ మొగ్గు చూపారనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. దీంతో, ఇప్పుడు తెలిగించిన ఓటర్లలో ఎక్కువగా హైదరాబాద్ లోని ఏపీలోనూ ఓటు ఉన్న వారివి గా చెబుతున్నారు. శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్, మేడ్చల్ తదితర ప్రాంతాలు లేదా రాష్ట్రాల నుంచి వచ్చి స్థిరపడిన వారి ఓట్లు ఎక్కువగా తొలగింపు జాబితాలో ఉన్నాయి. దీంతో.. ఈ నియోజక వర్గాల్లో ఇప్పటి వరకు ప్రాబల్యం చాటిన పార్టీల్లో టెన్షన్ మొదలైంది. దీంతో.. ముసాయిదా ప్రకటన తరువాత అర్హులైన ఏ ఒక్కరికీ ఓటు కోల్పోకుండా పార్టీలే తమ ఏజెంట్ల ద్వారా ఓటు నమోదు కోసం చొరవ తీసుకునేలా వ్యూహాలు సిద్దం చేస్తున్నారు. దీంతో.. ఈ ఓట్ల వ్యవహారం త్వరలో జరిగే గ్రేటర్ ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం చూపుతుందనే ఉత్కంఠ కొనసాగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+