VVS Laxman: వీవీఎస్ లక్ష్మణ్ కు బీసీసీఐలో కీలక పదవి..! త్వరలో ప్రకటన..!

హైదరాబాదీ సొగసరి బ్యాట్స్ మెన్, భారత మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ (VVS Laxman)కు బీసీసీఐ(BCCI)లో కీలక పదవి దక్కబోతోంది. ప్రస్తుతం బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కు ఛీఫ్ గా ఉన్న లక్ష్మణ్.. తాజాగా జింబాబ్వే పర్యటనలో టీమిండియాకు తాత్కాలిక హెడ్ కోచ్ గా కూడా వ్యవహరించాడు. ఈ సిరీస్ గెలిచి టీమిండియా తిరిగి ఫామ్ లోకి వచ్చింది. దీంతో లక్ష్మణ్ కు ఇప్పుడు మరో కీలక బాధ్యత అప్పగించేందుకు బీసీసీఐ సిద్దమవుతోంది.

India vs Sri Lanka 1st Test: శ్రీలంకతో తొలిటెస్టుకు టీమిండియా ఎలెవెన్ ఇదే..!
India vs Sri Lanka 1st Test: శ్రీలంకతో తొలిటెస్టుకు టీమిండియా ఎలెవెన్ ఇదే..!

వచ్చే నెలలో భారత క్రికెట్ మండలి (బీసీసీఐ) అంతర్గతంగా సమగ్ర ప్రక్షాళనకు సిద్దమవుతోంది. భారత సీనియర్ జట్టు సెలక్షన్ కమిటీ ఛైర్మన్‌గా ఉన్న అజిత్ అగార్కర్ పదవీకాలం సెప్టెంబర్‌లో ముగుస్తుండటం, జాతీయ జట్టు కోచింగ్ వ్యవస్థ ప్రక్షాళన అవసరం ఏర్పడటం వంటి కారణాలతో బీసీసీఐలోనూ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇందులో భాగంగా వీవీఎస్ లక్ష్మణ్‌కు డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ పదవిని అప్పగించే అవకాశం ఉందని ఇండియా టుడే తెలిపింది. అదే సమయంలో ఛీఫ్ సెలెక్టర్ అగార్కర్ పదవీకాలాన్ని 2027 జూన్ వరకు పొడిగించే అవకాశాలు కూడా ఉన్నాయి.

VVS Laxman Set for Bigger BCCI Role as Director of Cricket Amid September Reshuffle
IPL 2027: కెప్టెన్సీ ఇస్తే మళ్లీ పాత గూటికి ? హార్దిక్ పాండ్యా షరతు..!
IPL 2027: కెప్టెన్సీ ఇస్తే మళ్లీ పాత గూటికి ? హార్దిక్ పాండ్యా షరతు..!

వీవీఎస్ లక్ష్మణ్ కు బీసీసీఐ క్రికెట్ డైరెక్టర్ పదవి అప్పగిస్తే.. ప్రస్తుతం ఆయన చూస్తున్న బెంగళూరు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ డైరెక్టర్ పదవికి అదనంగా ఉంటుందని భావిస్తున్నారు. ఇప్పుడు క్రికెట్ డైరెక్టర్ పదవి లభిస్తే లక్ష్మణ్.. భారత్ లో క్రికెట్ కార్యకలాపాలకు ఆయన్ను కేంద్ర బిందువుగా మార్చే అవకాశం ఉంది. ఈ పదవిలో లక్ష్మణ్.. సీనియర్ జట్టు, సెలెక్టర్లు, కోచ్‌లు, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ వంటి విభాగాలను సమన్వయం చేయాల్సి ఉంటుంది. అలాగే యువకుల ప్రతిభను గుర్తించడం, ఆటగాళ్ల అభివృద్ధి, అత్యుత్తమ ప్రదర్శనకు ప్రణాళికల రచన వంటి బాధ్యతలు కూడా ఉంటాయి. గతంలో టీమిండియా హెడ్ కోచ్ బాధ్యత చేపట్టే అవకాశం వచ్చినా లక్ష్మణ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ను ఎంచుకున్నాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+