యశ్‌ను కర్ణాటకలో ఉండనివ్వం.. ప్రముఖ నటి స్ట్రాంగ్ వార్నింగ్!

కన్నడ రాకింగ్ స్టార్ యశ్ హీరోగా తెరకెక్కిస్తోన్న మోస్ట్ అవేటెడ్ మూవీ 'టాక్సిక్'. గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం భారీ అంచనాల నడుమ ఇటీవల విడుదలైన ట్రైలర్‌తో ఒక్కసారిగా వార్తల్లో నిలిచింది. ఓ వైపు ట్రైలర్లోని విజువల్స్, యశ్ స్టైలిష్ లుక్ భారీ యాక్షన్ సీక్వెన్సులు చూసి అభిమానులు పండగ చేసుకుంటుంటే.. మరోవైపు ఈ సినిమాలో కొన్ని రొమాంటిక్ సీన్లు తీవ్ర వివాదానికి దారితీశాయి.'

తీవ్రంగా మండిపడిన కన్నడ నటి రిషికా సింగ్
కన్నడ నటి, ప్రముఖ చిత్ర నిర్మాత రాజేంద్ర సింగ్ బాబు కూతురు రిషికా సింగ్ ఈ ట్రైలర్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియా వేదికగా ఓ వీడియోను విడుదల చేస్తూ.. సినిమాలోని రొమాంటిక్ సీన్లపై తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. యశ్ వంటి ప్రముఖ హీరో ఇలాంటి బోల్డ్ సన్నివేశాల్లో నటించాలనే నిర్ణయం తీసుకోవడం సరికాదని రిషికా సింగ్ ప్రశ్నించారు. ఓ భర్తగా, ఇద్దరు పిల్లల తండ్రిగా ఉన్న యశ్ మహిళల పట్ల, వారి గౌరవం పట్ల మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటారని తాను భావించానని.. కానీ ట్రైలర్‌లో చూపించిన సీన్లు తనను తీవ్రంగా నిరాశపరిచాయని ఆమె కామెంట్ చేశారు.

Yash Toxic Movie Controversy Actress Risheeka Singh Issues Strong Warning asking him to leave Karnataka

కర్ణాటక విడిచి వెళ్లిపోవాలంటూ హెచ్చరిక
ఈ వివాదాన్ని మరింత రాజేస్తూ రిషికా సింగ్ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. "సినిమాల పేరుతో మహిళల గౌరవానికి భంగం కలిగిస్తే సహించేది లేదు. మహిళలను గౌరవించకపోతే మిమ్మల్ని కర్ణాటక విడిచి వెళ్లేలా చేస్తాం" అని ప్రత్యక్షంగా యశ్‌ను హెచ్చరించారు. అంతే కాకుండా వీడియోకు చివరగా.."ఐ యామ్ టాక్సిక్" అంటూ యశ్ ను ఉద్దేశించి మండిపడ్డారు. ప్రస్తుతం ఆమెకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. రిషికా సింగ్ గతంలో 'కల్ల మల్ల సుల్లా', 'బెంకి బిరుగాలి'వంటి సినిమాలలో నటించడమే కాకుండా 'బిగ్ బాస్ కన్నడ' మొదటి సీజన్లో కంటెస్టెంట్ గా కూడా పాల్గొన్నారు.

నెటిజన్ల రియాక్షన్
రిషికా సింగ్ చేసిన కామెంట్స్ వీడియో నెట్టింట వైరల్ కావడంతో నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సినిమాలోని నటీనటులకే లేని అభ్యంతరం మీకెందుకని యశ్ ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు. అంతేకాకుండా రిషికా సింగ్ కామెంట్లను తిప్పకొట్టే క్రమంలో ఆమె గతంలో నటించిన సినిమాలు, చేసిన ఫోటోషూట్లకు సంబంధించిన పాత వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ కౌంటర్లు ఇస్తున్నారు. మరికొందరు మాత్రం రిషికా సింగ్ కు మద్దతు తెలుపుతూ.. సమాజానికి మంచి సందేశం ఇవ్వాల్సిన స్థానంలో ఉన్నవారు ఆలోచించి అడుగులు వేయాలని కామెంట్లు చేస్తున్నారు

భారీ అంచనాలతో 'టాక్సిక్'
ఈ వివాదాలు ఎలా ఉన్నప్పటికీ, గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో రూపొందుతున్న 'టాక్సిక్' చిత్రంపై అంతర్జాతీయంగా కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాను ఇంగ్లీషుతో సహా పలు భారతీయ భాషల్లో భారీ బడ్జెట్‌తో తెరకెక్కించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ చిత్రం ఆగస్టు 26న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ప్రస్తుతం ఈ వివాదం కారణంగా సినిమా ప్రచారానికి మరింత హైప్ వచ్చిపడింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+