NALSAR-CJI Row: హైదరాబాద్ నల్సార్ విద్యార్థులపై సీజేఐ కీలక ఆదేశాలు..! నిరసనలపై..!

హైదరాబాద్ నల్సార్ యూనివర్సిటీ (NALSAR)లో 2026 గ్రాడ్యుయేట్లకు పట్టాల ప్రధానం చేసే స్నాతకోత్సవ కార్యక్రమానికి సుప్రీంకోర్టు ఛీఫ్ జస్టిస్ సూర్యకాంత్ ను ఆహ్వానించడంపై విద్యార్ధుల నుంచి వెల్లువెత్తిన నిరసనల నేపథ్యంలో బార్ కౌన్సిల్ కీలక నిర్ణయం తీసుకుంది. నల్సార్ నుంచి ఈ ఏడాది గ్రాడ్యుయేట్లు అయిన లా విద్యార్ధులకు న్యాయవాదులుగా నమోదు చేయొద్దంటూ అన్ని బార్ కౌన్సిల్స్ కు ఆదేశాలు ఇచ్చింది. దీనిపై విమర్శలు వెల్లువెత్తడంతో గంటలోనే వాటిని వెనక్కి తీసుకుంది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (CJI) సూర్యకాంత్ కూడా స్పందించారు.

CJI కి విద్యార్ధుల షాక్ లు- మొన్న టాటా ఇన్ స్టిట్యూట్-ఇప్పుడు నల్సార్ వర్సిటీ..!
CJI కి విద్యార్ధుల షాక్ లు- మొన్న టాటా ఇన్ స్టిట్యూట్-ఇప్పుడు నల్సార్ వర్సిటీ..!

నల్సార్ లా విశ్వవిద్యాలయ విద్యార్థుల విషయంలో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (బీసీఐ) జోక్యాన్ని భారత ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ ఇవాళ తప్పుబట్టారు. ఏ న్యాయ విశ్వవిద్యాలయానికి చెందిన విద్యార్థులు లేదా అధ్యాపకులపైనా బీసీఐ గానీ, ఏ రాష్ట్ర బార్ కౌన్సిల్ గానీ ఎలాంటి శిక్షాత్మక చర్యలు తీసుకోకూడదని ఇవాళ ఆదేశాలు ఇచ్చారు. విద్యార్ధులకు నిరసన తెలిపే హక్కు విద్యార్థులకు ఉందని ఆయన తేల్చిచెప్పారు.

CJI Surya Kant Protects NALSAR Graduating Batch Says Students Have Right to Protest
E20 పెట్రోల్ ను ముందే వద్దన్న మారుతీ, టాటా మోటార్స్, మహీంద్రా? షాకింగ్ రిపోర్ట్..!
E20 పెట్రోల్ ను ముందే వద్దన్న మారుతీ, టాటా మోటార్స్, మహీంద్రా? షాకింగ్ రిపోర్ట్..!

ఈ అంశం తనకు, విద్యార్థులకు మధ్య సంభాషణగా ఉంటుందని అభివర్ణించిన సీజేఐ సూర్యకాంత్.. ఈ విషయంలో న్యాయ సంస్థల పాత్రను ప్రశ్నించారు. విద్యార్ధులకు నిరసన తెలపడానికి ఏదైనా కారణం ఉంటే... దీనితో బీసీఐకి ఎటువంటి సంబంధం లేదని తెలిపారు. తాము విద్యార్ధులకు అండగా ఉన్నామన్నారు. విద్యార్థులు తనకు ఒక లేఖ రాశారని, అది విద్యార్థులకు, తనకు మధ్య జరిగిన సంభాషణ అని తేల్చేశారు. ఇది బీసీఐకి పూర్తిగా అనవసరమైన విషయమని, అస్సలు అవసరం లేని విషయమని సీజేఐ స్పష్టం చేశారు. తాను విద్యార్థిగా ఉన్నప్పుడు స్వయంగా విద్యార్థి కార్యకలాపాలలో చురుకుగా పాల్గొన్నానని గుర్తుచేసుకున్నారు. శాంతియుతంగా తమ గళం వినిపిస్తున్న విద్యార్థులను అందుకు అనుమతించాలని సీజేఐ సూచించారు. దీంతో వివాదాస్పద ఉత్తర్వును ఇప్పటికే వెనక్కి తీసుకున్నట్లు బీసీఐ తరఫు న్యాయవాది తెలిపారు. నల్సార్ విద్యార్దులు కావాలంటే సుప్రీంకోర్టు బార్ కౌన్సిల్ లో కూడా లాయర్లుగా నమోదు చేసుకోవచ్చని సీజేఐ సూచించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+