అవి మీ కుటుంబ కేసులు, వైఎస్ పై ఆరోపణలు నిరూపిస్తే..: పవన్ కు కేవీపీ ఛాలెంజ్..!!
జనసేనాని పవన్ పై వైఎస్ ఆత్మ బంధువు కేవీపీ ఆగ్రహం వ్యక్తం చేసారు. వైఎస్సార్ పైన పవన్ చేసిన వ్యాఖ్యల కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. వైఎస్ తన మీద కేసులు పెట్టారనే పవన్ వ్యాఖ్యల ను ఖండించారు. అవి తనకు తెలిసినంత వరకు పవన్ కుటుంబంలో పెట్టుకున్నవిగా లేఖలో పేర్కొన్నారు. పవన్ గురించి ఆలోచించే తీరిక నాడు వైఎస్ కు లేదన్నారు. ఒక పోలీసు అధికారి వైఎస్ ప్రణాళికలను చెప్పారంటూ వపన్ చేసిన వ్యాఖ్యలను లై డిటెక్టర్ తో రుజువు చేయాలంటూ ఛాలెంజ్ చేసారు.
జనసేన అధినేత పవన్ కు కాంగ్రెస్ నేత.. వైఎస్సార్ మిత్రుడు కేవీపీ రామచంద్రరావు లేఖ రాసారు. తాజాగా పవన్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించారు. వపన్ తన ప్రసంగంలో తాను చికిత్స కోసం ఆస్పత్రిలో ఉన్న సమయంలో ఒక పోలీసు అధికారి అప్పటి సీఎం వైఎస్ కేసులు పెట్టేలా ప్రణాళికలు చేస్తున్నారని చెప్పిన విషయాన్ని లేఖలో ప్రస్తావించారు. ఆ సమయంలో పవన్ కుటుంబంలో మీలో మీరు పెట్టుకున్న కేసులు తప్ప.. ఎలాంటి తప్పుడు రాజకీయ కేసులు బనాయించినట్లు ఆధారాలు లేవని వివరించారు. ఏ ముఖ్యమంత్రి అయినా తన రాజకీయ ప్రణాళికలను పోలీసు ఆఫీసర్లతో చర్చించరని చెప్పుకొచ్చారు. పవన్ కు చెప్పిన ఆ పోలీసు అధికారి లై డిటెక్టర్ ముందు మీరు చెప్పిన విధంగా వైఎస్ చెప్పారని చెబితే.. రూ 10 కోట్లు పవన్ చెప్పిన సంస్థకు విరాళంగా ఇవ్వటానికి సిద్దమని ఛాలెంజ్ చేసారు. మరణించి 17 ఏళ్లు అయినా.. ఇప్పటికీ వైఎస్ ఇమేజ్ చెక్కు చెదరలేదని వివరించారు.

వైఎస్ పైన నిరాధార ఆరోపణలు చేయవద్దు
అప్పట్లో మీరు రంగంలోకి దిగితే ప్రత్యర్థులు రాజకీయంగా కనుమరుగైపోతారనే అన్నంత ప్రజాభి మానం మీకు పొంగిపొర్లిన దాఖలాలు లేవన్నారు. నిజంగా అంతటి రాజకీయ ప్రజాభిమానం అప్పుడూ లేదు.. ఆ తరువాత లేదని 2019 లో పవన్ రెండు చోట్ల ఓడిన సందర్భాలను కేవీపీ తన లేఖలో గుర్తు చేసారు. యువరాజ్యం అధ్యక్షుడుగా పవన్ నాడు కాంగ్రెస్ నేతలపై అభ్యంతర కర వ్యాఖ్యలు చేసినా.. నాడు ఏ కేసులు పెట్టలేదని.. ఒక స్థాయి ఉన్న ప్రతీ నాయకుడు పవన్ వ్యాఖ్యలను పిల్ల చేష్టలుగా తీసిపారేసారని చెప్పుకొచ్చారు. నాటి చెగువేరా మార్గం నుంచి ఇప్పుడు సనాతన ధర్మ పరిరక్షకుడిగా పరిణితి చెంది కూడా ఇలా అర్దం పర్దం లేని ఆరోపణలు చేయటం తగని పని కాదని పేర్కొన్నారు. కొంత మంది ప్యాకేజీ స్టార్ అంటే మీ మనసు ఎంత గాయపడిందో అర్దం చేసుకోగలనని.. జనం మెచ్చిన నాయకుడి పైన అసత్య ఆరోపణలు చేస్తే ఆయన అభిమానులు కూడా బాధ పడతారని గ్రహించాలని సూచించారు.













Click it and Unblock the Notifications