'పెద్ది' నార్త్ ఇండియా రివ్యూ: 'దంగల్' ను మింగేశావ్ ఏంటన్నా..!!

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు యావత్ భారత్ లో 'పెద్ది' హవా నడుస్తోంది. తెలంగాణ, ఏపీలోనే కాకుండా ఉత్తరాది రాష్ట్రాల్లోనూ 'పెద్ది' ప్రభంజనం కొనసాగుతోంది. అన్ని చోట్లా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మూవీని బ్లాక్ బస్టర్ టాక్ వస్తోంది. రామ్ చరణ్ నటవిశ్వరూపం నార్త్ అభిమానులను ఆశ్చర్య పరుస్తోంది. ఇలాంటి సినిమా తాము బాలీవుడ్ లో ఇప్పటివరకూ చూడలేదంటూ చెప్పుకుంటున్నారు.

బాలీవుడ్ ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ అయిన 'దంగల్' మూవీ రికార్డ్స్ ను కూడా 'పెద్ది' దాటేస్తుందంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ముఖ్యంగా కుస్తీ సీన్స్ లో రామ్ చరణ్ ట్రాన్స్ ఫార్మేషన్ కు నార్త్ ఆడియన్స్ ఫిదా అవుతున్నారు. అలాగే ఎమోషనల్ సీన్స్ లో భాషతో సంబంధం లేకుండా రామ్ చరణ్ తన నేచురల్ నటనతో హిందీ ఆడియన్స్ నూ కంటతడి పెట్టించాడని టాక్. ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత బాలీవుడ్ లో రామ్ చరణ్ కు మళ్లీ అదే రేంజ్ హిట్ కన్ఫామ్ అంటూ మెగా ఫ్యాన్స్ కాలర్ ఎగరేస్తున్నారు.

అటు బుక్ మై షో లోనూ పెద్ది ప్రభంజనం సృష్టిస్తోంది. గంటకు దాదాపు 40 వేలకు పైగా టికెట్స్ బుక్ అవుతున్నాయి. కల్కీ, సలార్ చిత్రాల తర్వాత బుక్ మై షో లో విధ్వంసం సృష్టిస్తున్న మూడో సినిమాగా పెద్ది నిలిచింది. రిలీజ్ రోజే ఇలా ఉంటే రానున్న రోజుల్లో పెద్ది సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి చరిత్రను సృష్టిస్తుందోనని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ప్రీమియర్ షో నుంచే పెద్ది సినిమాకు బ్లాక్ బస్టర్ టాక్ రావడంతో అటు మెగా ఫ్యాన్స్, సాధారణ ప్రేక్షకులతోపాటు సెలబ్రిటీలు కూడా థియేటర్లకు క్యూ కడుతున్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ స్టామినా ఏంటో చాలా రోజుల తర్వాత తెలుగు రాష్ట్రాల్లో కనిపిస్తోంది.

సంక్రాంతి తర్వాత పెద్ద సినిమాలు లేక ఇన్ని రోజులు థియేటర్లు వెలవెలబోయాయి. ఎట్టకేలకు పెద్ది రూపంలో థియేటర్ల వద్ద పండగ వాతావరణం నెలకొంది. మరో రెండు వారాలు థియేటర్ల వద్ద పండగ వాతావరణమే కొనసాగే అవకాశం ఉంది.

Peddi North India Verdict Ram Charan Film Likely to Break Dangal Records Strong Positive Feedback

ఇక లాంగ్ రన్ లో రామ్ చరణ్ ఇండస్ట్రీ హిట్ కొట్టడం పెద్ద కష్టమేమీ కాదని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ ఏడాది సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి మనశంకర వర ప్రసాద్ తో ఇండస్ట్రీ హిట్ కొట్టారు. ఇప్పుడు రామ్ చరణ్ అంతకుమించి భారీ బ్లాక్ బస్టర్ దిశగా దూసుకెళ్తున్నారు. దాంతో మెగా ఫ్యాన్స్ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+